సైంటిస్టులు ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి పరిశోధిస్తూనే ఉంటారు. తాము అనుకున్నది సాధించటానికి ఎంతో కష్టపడుతుంటారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తాము అనుకున్నది సాధించటానికి అహర్నిశలు పరితపిస్తుంటారు. అయితే, సైంటిస్టులు చేసే పరిశోధనల్లో నూటికి 10 శాతం మాత్రమే ఫలితాలను ఇస్తుంటాయి. మిగిలిన వారి ప్రయోగాలు విఫలం అవుతుంటాయి. అలా ఫెయిల్ అయిన వారిలో విన్‌త్రాప్ నైల్స్ కెలాగ్ అనే సైంటిస్ట్, సైకాలజిస్ట్ కూడా ఒకరు. ఆయన తన కుమారుడు, చింపాజీతో ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. దారుణమైన ఫలితాలను ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మిగితా స్టోరీ చదివేసేయండి.
అమెరికాకు చెందిన విన్‌త్రాప్ నైల్స్ కెలాగ్.. సైకాలజిస్ట్‌గా ఎంతో ప్రాచూర్యం పొందారు. 1930లలో ఆయన ఓ ప్రయోగానికి తెరతీశారు. 1930, నవంబర్ 15న పుట్టిన గువ అనే ఓ చింపాజీని క్రాస్ రియరింగ్ స్టడీ కోసం ఎంచుకున్నాడు. ఆ చింపాజీనీ దాని కంటే మూడు నెలలు పెద్దవాడైన తన కుమారుడు డొనాల్డ్‌తో కలిపి పెంచాలని డిసైడ్ అయ్యాడు. ఇలా చేస్తే కోతి తన అలవాట్లను, పద్దతులను కోల్పోయి మనిషిగా మారుతుందని ఆయన భావించాడు. గువాను ఇంటికి తీసుకుపోయాడు. అతడి ప్లాన్‌కు అతడి భార్య కూడా సహకరించసాగింది. గువ, డొనాల్డ్ ఇద్దరూ అన్నా, చెల్లెళ్లలాగా పెరగసాగారు. ఈ ప్రయోగం దాదాపు 9 నెలల పాటు సాగింది.
ఈ సందర్భంగా భార్యాభర్తలు గువ, డొనాల్డ్‌పై కొన్ని పరీక్షలు కూడా చేశారు. అయితే, ప్రయోగం బెడిసి కొట్టింది. గువ, డొనాల్డ్‌లా మారలేదు సరికదా.. వారి కుమారుడు డొనాల్డ్ పూర్తిగా చింపాంజీలా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. మనుషుల్ని కొరికే వాడు, కోతిలా శబ్ధాలు చేసేవాడు, కోపంగా ఉండేవాడు, కోతిలా ఆహారం తినేవాడు, నాలుగు కాళ్లపై నడిచేవాడు. తమ కుమారుడిలో వచ్చిన ఈ మార్పుల కారణంగా విన్‌త్రాప్ ప్రయోగాన్ని నిలిపివేశాడు. గువాను ఫ్లోరిడాలోని సంరక్షణా కేంద్రానికి పంపేశాడు. అక్కడ ఆ చింపాజీపై మరికొన్ని ప్రయోగాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే 3 ఏళ్ల వయసులో గువా నిమోనియాతో చనిపోయింది. చాలా ఏళ్ల తర్వాత 1973లో డొనాల్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 100 ఏళ్ల జీవితం కలిగిన డొనాల్డ్(మనిషి) 43 ఏళ్లకు.. 30 ఏళ్ల జీవితం కలిగిన గువ(చింపాంజీ) 3 ఏళ్లకు అర్థాంతరంగా తమ జీవితాలను ముగించారు.