ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ముఖ్యంగా వైద్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి అసాద్యాన్ని సుసాద్యం చేస్తున్నారు.
మనిషి తల్చుకుంటే దేన్నైనా సాధించగలరు అని ఎన్నోసార్లు రుజువు చేశాడు. భూమి, సముద్రం, ఆకాశం.. చివరికి అంతరిక్షాన్ని సైతం శాసించే స్థాయికి చేరుకున్నాడు. ముఖ్యంగా వైద్యరంగంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి మనిషికి అసాధ్యం అనేది లేదని నిరూపించారు. దేవుడు మనకు జన్మనిస్తే.. వైద్యులు ప్రమాద సమయంలో పునఃజన్మనిస్తాడు. అందుకే వైద్యో నారాయణో హరీ అంటారు. అమెరికన్ డాక్టర్లు ఓ అరుదైన శస్త్రచికిత్స చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలతో ముందుకు సాగుతున్నాం. వైద్యులను దేవుళ్లతో పోల్చుతుంటారు.. ఎందుకంటే దేవుడు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. ఓ మహిళ గర్భంలోని శిశువుకు మెదడులో సమస్య ఏర్పడగా, పుట్టబోయే బేబి అబ్ నార్మల్ గా ఉంటుందని గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. ఇది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారమని తెలిపారు. తరవాత సర్జరీని విజయవంతం చేశారు. ఈ సంఘటన బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ లో జరిగింది. మెదడు నుంచి గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని వైద్యులు గుర్తించారు.
శిశువు పుట్టిన వెంటనే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడమో , హార్ట్ ఫెయిల్ అవడమో జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ తల్లి తనకు ఏం జరిగినా పరవాలేదు.. తనకు పుట్టబోయే పాప బాగుండాలని కోరుకుంది. డాక్టర్లకు పూర్తిగా సహకారం అందిస్తానని తెలిపింది. ఈ సదంర్భంగా ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ‘ఈ సర్జరీని ఒక సవాల్ గా స్వీకరించాం. చిన్నారి ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడేవారి సంఖ్య చిన్నారుల్లో 50-60 శాతం మంది మాత్రమే సేఫ్ గా ఉన్నారు. మిగతా 40శాతం మంది పురిట్లోనే చనిపోయారు. అల్ట్రా సౌండ్ తీసినప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉందని తెలిసింది. క్లిష్టమైన పరిస్థితిలో కూడా సర్జరీని విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.