lతల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి అవసరమైనవి సమకూర్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అమ్మ ప్రేమతో లాలిస్తే.. నాన్న తన భుజాలపై వారిని ఆడిస్తూ ఉంటాడు. రక్షణగా ఉండాల్సిన తండ్రే డబ్బుల కోసం బిడ్డకు రక్షణ లేకుండా చేస్తున్నాడు.
తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి అవసరమైనవి సమకూర్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అమ్మ ప్రేమతో లాలిస్తే.. నాన్న తన భుజాలపై వారిని ఆడిస్తూ ఉంటాడు. మంచిచెడు, విద్యాబుద్ధులు నేర్పే తండ్రే.. బిడ్డలను జీవితాంతం కాపాడుకుంటూ వస్తాడు. అలాంటి నాన్నే.. కఠినంగా వ్యవహరిస్తే.. కన్న ప్రేమకన్నా కరెన్సీ నోటుకి విలువ ఇచ్చి బిడ్డని అమ్మకానికి పెడితే!. ఊహించుకుంటేనే ఘోరంగా అనిపించే ఈ ఘటన.. తాజాగా వరంగల్ జిల్లాలో నిజంగానే జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కన్న కొడుకునే తల్లికి తెలియకుండా అమ్మేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి రూ.2.5 లక్షలకు బేరం కుదుర్చుకుని కొడుకుని అమ్మేశాడు. అయితే కొడుకు కనిపించకపోవడంతో తల్లి వెతకడం ప్రారంభించింది. అప్పుడు అసలు సంగతి బయటపడింది. పిల్లలను కాపాడాల్సిన తండ్రే కఠినుడిగా మారితే బ్రతకడం ఎలా? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.. వరంగల్ జిల్లాలో మసూద్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటుంది. అతడికి ఇద్దరు కొడుకులు సంతానం. అయితే మసూద్ తన పెద్దకొడుకైన అయాన్‌ను అమ్మేందుకు నిర్ణయించుకున్నాడు. శఖరాసికుంటకు చెందిన మహిళ మధ్యవర్తిగా వ్యవహరించి హైదరాబాద్ నుంచి ఓ కుటుంబాన్ని తీసుకువచ్చింది. బేరాసారాలు చేసి చివరకు రూ.2.5 లక్షలకు అయాన్‌ను ఇచ్చేందుకు నిర్ణయించింది.
మసూద్ తన పెద్ద కొడుకును ఇచ్చి రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడు. నాలుగు రోజులుగా అయాన్ ఇంట్లో కనబడకపోయేసరికి తల్లి అనుమానం వచ్చింది. దీంతో చుట్టు పక్కల బిడ్డ కోసం ఆ తల్లి వెతకడం మొదలు పెట్టింది. అనుమానంతో మసూద్‌ను నిలదీయగా మొదట తన సోదరి ఇంట్లో ఉన్నాడని మభ్యపెట్టాడు. వారి కుటుంబసభ్యులు గట్టిగా మందలించేసరికి బాలున్ని అమ్మినట్లు ఒప్పుకున్నాడు. బాలుని మేనమామ సాయంతో పోలీస్‌స్టేషన్ కి వెళ్లి.. బాధితులు ఫిర్యాదు చేశారు.. పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రక్షణగా ఉండాల్సిన తండ్రే డబ్బుల కోసం బిడ్డకు రక్షణ లేకుండా చేస్తున్నా.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.