అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడమే ఆమె ప్రాణాలు తీసింది. తలుపులు తెరిచేందుకు యత్నించడంతో.. ఆగంతుకుడు అని సొంత తండ్రే కాల్చి చంపేశాడు. ఈ హృదయవిదారకర ఘటన వాషింగ్టన్ లోని ఓహియోలో జరిగింది. బుధవారం తెల్లవారుజామున జైన్ హైర్స్టన్.. తల్లి ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేసింది. తన 16 ఏళ్ల కుమార్తెను దొంగ అనుకుని ఆమె తండ్రి కాల్చినట్లు తెలిపింది. కాసేపటికి వచ్చిన ఎమర్జన్సీ వారు జైన్ ను లోకల్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 5.42 గంటలకు ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
వారి గరాజ్ నుంచి చప్పుళ్ళు రావడం తల్లిదండ్రులు ఇద్దరు విన్నట్లు తెలిపారు. కాల్పులు జరిపిన తర్వాత వెళ్లి చూస్తే తమ కుమార్తె నెత్తుటి మడుగులో కనిపించినట్లు చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండాపోయింది. ఇలాంటి ఘటన అమెరికాలో లో కొత్తేమీ కాదు. ఈ ఘటనపై ఎంతో చింతిస్తున్నామంటూ లోకల్ మీడియా కథనాన్ని ముద్రించింది. గన్ వైలెన్స్ ఆర్కైవ్స్ లెక్కల ప్రకారం అమెరికాలో 2021లో మొత్తం 44,000 మంది కాల్పుల్లో మరణించారు. వారిలో 1517 మంది మైనర్లే ఉన్నారు. ఈ విషాదకర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.