దక్షిణ పసిఫిక్ లోని ద్వీప దేశం టోంగాలో సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం.. కనీ వినీ ఎరుగని రీతిలో విస్పోటనం చెందడంతో సముద్రంలో భూకంపం చెలరేగి భారీ సునామీ అలలు ఏర్పడ్డాయని అంటున్నారు. దీంతో అమెరికా పశ్చిమ తీరంతోపాటు టోంగా, ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో భారీ సునామీ రావొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. టోంగా అగ్నిపర్వతం బద్దలైన భారీ విస్పోటనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అక్కడి స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వివరాల ప్రకారం. పసిఫిక్‌లో మహాసముద్ర అంతర్భాగంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ అగ్నిపర్వతం.. టోంగాన్ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిపర్వతం పేలిన శబ్దాలు 8 నిమిషాల పాటు వినిపించాయి. విస్ఫోటన ప్రభావం 800 కిలోమీటర్ల దూరంలో ఫిజీ దీవులకు కనబడింది. పేలుడు తర్వాత నమోదైన గరిష్ట సునామీ వేవ్ 30 సెంటీమీటర్లుగా రికార్డు అయింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు ఏర్పడ్డాయని టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ పేర్కొంది.
ఇక పేలుడుతో ఆవరించిన అసిడిక్ బూడిద పడకుండా నీటి సేకరణ ట్యాంకులను కప్పి ఉంచాలని అక్కడ నివాసితులను అధికారులు హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండాలని, బయటకు వస్తే మాస్క్ ధరించాలని టోంగా జియోలాజికల్ సర్వీసెస్ అధిపతి తానియెలా కులా ప్రజలకు సూచించారు. సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
Tonga’s Hunga Tonga volcano just had one of the most violent volcano eruptions ever captured on satellite. pic.twitter.com/M2D2j52gNn
— US StormWatch (@US_Stormwatch) January 15, 2022
Tonga’s Hunga Tonga volcano erupted early this morning sending out a massive shock wave captured on satellite pic.twitter.com/0CJH6R1VYZ
— Latest in space (@latestinspace) January 15, 2022
This is the moment tsunami waves crash into Tonga, after an underwater volcano erupted earlier on Saturday.
👉 Keep up with the 1News LIVE updates on this developing story: https://t.co/GRqRXeuqhV pic.twitter.com/kBG7nxSj51
— 1News (@1NewsNZ) January 15, 2022
This is the moment tsunami waves crash into Tonga, after an underwater volcano erupted earlier on Saturday.
👉 Keep up with the 1News LIVE updates on this developing story: https://t.co/GRqRXeuqhV pic.twitter.com/kBG7nxSj51
— 1News (@1NewsNZ) January 15, 2022
🌊⚠️🌋 #Tsunami warning for #Tonga as underwater #volcano erupts
📰 https://t.co/ZMWyCrRkNW#HungaTongaHungaHaapai#eruption
Fri Jan 14 2022
🔱 ABYSS ℭ 𝔥 𝔯 𝔬 𝔫 𝔦 𝔠 𝔩 𝔢 𝔰 | 𝙳𝚘𝚘𝚖 𝙽𝚎𝚠𝚜 pic.twitter.com/9LWzBuKIjK
— ♆ABYSS ℭ 𝔥 𝔯 𝔬 𝔫 𝔦 𝔠 𝔩 𝔢 𝔰 (@AbyssChronicles) January 14, 2022