ప్రపంచంలో మొన్నటి వరకు కరోనా భయపెడితే ఇప్పుడు భూకంపాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇటీవల వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ఏడాది టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప కారణంగా 50 వేలకు పైగా ప్రజలు చనిపోయారు.. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ మద్య పలు దేశాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న ఇండోనేషియాలో భూకంపం సృష్టించిన బీభత్సం మరువక ముందే.. మంగళవారం ఉదయం సోలమాన్ దీవుల్లో భారీ భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0 గా నమోదైందని అంటున్నారు. ఈ క్రమంలో సునామీ హెచ్చిరికలు సైతం జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగోలాకు 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని, దాదాపు 20 సెకండ్ల […]
దక్షిణ పసిఫిక్ లోని ద్వీప దేశం టోంగాలో సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం.. కనీ వినీ ఎరుగని రీతిలో విస్పోటనం చెందడంతో సముద్రంలో భూకంపం చెలరేగి భారీ సునామీ అలలు ఏర్పడ్డాయని అంటున్నారు. దీంతో అమెరికా పశ్చిమ తీరంతోపాటు టోంగా, ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో భారీ సునామీ రావొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. టోంగా అగ్నిపర్వతం బద్దలైన భారీ విస్పోటనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో ఎత్తైన […]
క్రిస్మస్ పండుగ అయిపోయింది.. మరి కొద్ది రోజుల్లో 2021కి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరం 2022కి స్వాగతం పలకబోతున్నాం. గత రెండేళ్లుగా కోవిడ్ ప్రపంచాన్ని పీడిస్తోంది. మరి రానున్న కొత్త సంవత్సరం అయినా బాగుంటుందా.. అసలు వచ్చే ఏడాది ప్రపంచ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో మరో సారి బల్గేరియన్ బ్లైండ్ బాబా వాంగా పేరు తెర మీదకు వచ్చింది. గతంలో చాలా సార్లు అంధురాలైన ఆమె […]
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన వనౌతులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రత నమోదయ్యింది. భూకంపం తీవ్రత కారణంగా సునామీ వచ్చే అవకాశమున్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంతాలను సముద్ర అలలు ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దేశమైన ఈ […]