కష్టపడితేనే జీవితంలో పైకి వస్తారని చాలా మంది బలంగా నమ్ముతారు. అయితే కష్టంతో పాటు కాస్త అదృష్టం ఉంటే మనిషి ఉన్నత స్థాయిలో వెళ్తాడు. కొందరు ఎంత కష్టపడిన.. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే మరికొందరిని చూస్తే మాత్రం.. ఆశ్చర్యం కలుగుతుంది. ఏం చేసిన మంచి ఫలితాలు వస్తుంటాయి. అందుకే అందరు అలాంటి వారిని అదృష్టవంతుడు అని అంటుంటారు. కానీ మరికొందరికి మాత్రం లక్కపట్టినట్లు అదృష్టం పట్టుకుంటుంది. అలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి తగిలిన లాటరీని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి రూ.16,500 కోట్లు లాటరీ తగిలింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. అదృష్టం ఉండొచ్చు కానీ మరీ.. ఇంతలానా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఉదయం అమెరికాలోని తల్లాహాస్సీలోని ఫోరిడా లాటరీ డ్రా స్టూడియోలో లాటరీ టిక్కెట్ల డ్రా కార్యక్రమం జరిగింది. ఈ ఫ్లోరిడా లాటరీ స్టూడియోలో తీసిన ఆ డ్రాలో 10,33,41,47,56 నంబర్ల టికెట్లకు లాటరీ తగిలింది. అయితే వీటిలో 33, 41, 47, 56 నంబర్ల టికెట్లకు మాములు మొత్తంలోనే లాటరీ తగిలింది. అయితే 10 నంబర్ టికెట్ కి మాత్రం రెడ్ పవర్ బాల్ 10 గా నిలిచింది. ఈ టికెట్ ను అల్డాడెనాలోని జోస్ సర్వీస్ సెంటర్ ప్రాంతంలో విక్రయించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పవర్ బాల్ టికెట్ కు 2.04 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.16,500కోట్ల ఉంటుంది. అంటే పవర్ బాల్ గెల్చుకున్న 10 నంబర్ లాటరీ టికెట్ వ్యక్తికి రూ.16,500 కోట్ల జాక్ పాట్ తగిలింది. ఇక ఆ అదృష్టవంతుడి వివరాల విషయానికి వస్తే.. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓ ప్రాంతాన్నికి చెందిన వ్యక్తి అని తెలిసింది. అయితే అతడి సంబంధించిన ఎటువంటి సమాచారం సంస్థ ప్రతినిధుల వద్దలేవు. అయితే ఇప్పటి వరకు ఆ టికెట్ గురించి ఎవరూ రాలేదు. ఆ వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ‘అదృష్టం మీద ఎక్కి కూర్చున్నా కూడా వీడేవడో చేతులతో విసిరేశాడే’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.