గ్లాస్గో వేదిక అంతర్జాతీయ వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ కాప్-26 సదస్సులో ప్రధాని మోదీ సహా చాలా మంది దేశాధినేతలు పాల్గొన్నారు. అందరూ ప్రపంచ వాతావరణ పరిస్థితలపై చర్చలు సాగిస్తున్నారు. ఇదే వేదికపై 14 ఏళ్ల భారతీయ విద్యార్థిని వినీశా ఉమాశంకర్ వెల్లబుచ్చిన వేదన అందరినీ ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. “మీ అబద్ధపు హామీలు వినీవినీ మేము విసిగిపోయాము. మీ పై కోపం వస్తుంది కానీ ప్రదర్శించే సమయం నా దగ్గర లేదు. భవిష్యత్ నిర్మాణం మీరు చేయలేకపోయినా మేమైనా నిర్మించుకోవాలి కదా. దయచేసి ప్రపంచ నేతలు మాతో కలిసి భావితరాల నిర్మాణానికి సహకరించండి” అని అంతర్జాతీయ వాతావరణ సదస్సు సాక్షిగా చేసిన ప్రసంగంతో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది.
తమిళనాడు తిరుమణ్ణలై జిల్లాకు చెందిన 14 ఏళ్ల వినీశా ఉమాశంకర్.. చిన్నతనంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చే సమయంలో బొగ్గుతో ఇస్త్రీ చేసే వారిని చూసేది. వాళ్లు వాడే బొగ్గు వలన ఏర్పడుతున్న కాలుష్యంపై ఆలోచించేది. అలా చేస్తున్న ఆలోచనల ఫలితంగా 12 ఏళ్ల ప్రాయంలో సౌరశక్తితో నడిచే ‘ ఐరనింగ్ బండి’ ని రూపొందించింది. బ్రిటన్ రాకుమారుడు ప్రారంభించిన ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లింది. అలా ప్రపంచానికి పరిచయమైన వినీశా.. ప్రిన్స్ విలియమ్స్ ఆహ్వానం మేరకు కాప్-26 సదస్సులో పాల్గొంది. ‘క్లీన్ టెక్నాలజీ, ఇన్మోవేషన్’ అనే అంశంపై సదస్సులో ప్రసంగించింది.
మన దేశ ప్రధానితో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా అధినేతలు హాజరైన ఈ సమావేశంలో వినీశా ఉమాశంకర్ ఏ మాత్రం భయపడకుండ తన అభిప్రాయాన్ని తెలిపింది. భూమి తల్లిని కాపాడాలని ప్రార్థించింది. ‘హామీలు ఇచ్చి విఫలమైన ప్రపంచనేతలపై ఈతరం వారు విసుగుతో ఉన్నారు. అయినా మీపై కోపం తెచ్చుకునే సమయం కూడా లేదు. ఏందుకంటే మేము మీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. నేను భారతమాత పుత్రికనే కాదు పుడమి తల్లి పుత్రికను. కాలుష్యం సృష్టించే వాటితో ఆర్థిక వ్యవస్థను నిర్మించడం ఇకనైనా ఆపాలని కోరింది. వాటికి బదులుగా కొత్త ఆవిష్కరణల కోసం ధనం వెచ్చించండి. మీరు ఇక్కడే ఉంటారు అన్నా పర్వాలేదు. మా భవిష్యత్తును మేం నిర్మించుకుంటాము’ అంటూ ఉమా ఉద్వేగభరితంగా ప్రసంగించింది. ఆమె ఉపన్యాసానికి సభావేదిక తమ కరతాళ ధ్వనులతో దద్దరిలింది.
ఈ భూ మండలం ఎదుర్కొంటున్న సవాళ్లకు యువ సృజనాత్మక ఆవిష్కరణలను తీసుకరావలనే ఉద్దేశంతో ప్రిన్స్ విలియమ్స్ గతేడాది వీటిని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారికి 5 విభాగాల్లో బహుమతులు ప్రధానం చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ ఐదు రంగాల్లో కృషిచేసిన ఐదుగురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 1 మిలియన్ పౌండ్లు(దాదాపు రూ.9.5 కోట్లు) చొప్పున్న నగదు బహుమతిగా ఇస్తారు. ఈ సంవత్సరానికి గాను దిల్లీకి చెందిన విద్యామోహన్ విన్నర్ గా నిలువగా… ఉమాశంకర్ ఫైనలిస్ట్ గా నిలిచింది. భారతీయ విద్యార్థినులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో వెలుగులోకి రావడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Here is a name you will hear again: Vinisha Umashankar.
She is just 15 years old. One of the finalists of @EarthshotPrize.
Prince William asked her to address the world leaders at @COP26
“I’m not just a girl from India, I’m a girl from Earth.” 🌍 🌏
Watch below 👇 pic.twitter.com/F4vZdLWlvE— Chris Ship (@chrisshipitv) November 2, 2021
Standing ovation Speech 🔥👏#VinishaUmaShankar at #COP26 pic.twitter.com/PWxoUg4soI
— HeisenKey™ (@KNandd) November 3, 2021