గ్లాస్గో వేదిక అంతర్జాతీయ వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ కాప్-26 సదస్సులో ప్రధాని మోదీ సహా చాలా మంది దేశాధినేతలు పాల్గొన్నారు. అందరూ ప్రపంచ వాతావరణ పరిస్థితలపై చర్చలు సాగిస్తున్నారు. ఇదే వేదికపై 14 ఏళ్ల భారతీయ విద్యార్థిని వినీశా ఉమాశంకర్ వెల్లబుచ్చిన వేదన అందరినీ ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. “మీ అబద్ధపు హామీలు వినీవినీ మేము విసిగిపోయాము. మీ పై కోపం వస్తుంది కానీ ప్రదర్శించే సమయం నా దగ్గర లేదు. భవిష్యత్ నిర్మాణం మీరు చేయలేకపోయినా […]