భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు అయ్యాయి. ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం 3 రకాల ప్రభుత్వ పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచి అందరికీ శుభవార్త తెలిపింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది. ఈ మద్య స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను పెంచుతూ గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతోమందికి అదనపు లబ్దీ చేకూరనుంది. ఈ పథకంలో చేరే వారికి అధిక రాబడి వస్తుంది. అయితే.. ఎంపిక చేసిన పథకాలపైనే ఈ వడ్డీ రేట్లను పెంచిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న పోస్టాఫీస్ మంచి స్కీమ్ అందిస్తుంది. ఈ స్కీమ్ లో చేరితే రూ. 3.5 లక్షలు వస్తాయి.. అది ఏవిధంగా వస్తాయో తెలుసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కేంద్ర సర్కార్ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లపై వడ్డీ రేటును పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఈ పథకంలో వడ్డీ రేటు 6.2 ఉంటే.. తాజాగా 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు పెంచారు. ఈ క్రమంలో వడ్డీ రేటు ఇప్పుడు 6.5 శాతానికి పెరిగింది. ఇక పోస్టాపీస్ రికరింగ్ స్కీమ్ లో కొత్తగా ఎవరైనా చేరితే 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే ఈ స్కీమ్ ఐదేళ్ల వరకు ఉంటుంది. ఐదేళ్ల పాటు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్కీమ్ లో చేరిన వారు కొత్త వడ్డీ రేట్ల ప్రకారం ఎంత వరకు పెట్టుబడి పెడితే పూర్తయ్యేనాటికి ఎంత సొమ్ము వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంది.
మీరు రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరి నెలకు రూ.2 వేల వరకు పెట్టుబడి పెడితే.. ఐదు సంవత్సరాల నాటికి రూ.1.41 లక్షలు వస్తాయి. నెలకు రూ.3 వేలు పెడితే మీకు 2.12 లక్షలు లభిస్తాయి. అదే నెలకు రూ.4 వేల చొప్పున డిపాజిట్ చేస్తే.. 5 ఏళ్లు అంటే మెచ్యూరిటీ పిరియడ్ పూర్తయిన తర్వాత మీకు రూ.2.82 లక్షలు వస్తాయి. మీకు వడ్డీ రూపంలో రూ.44 వేలు వస్తాయి. ఈ స్కీమ్ లో మీరు ఒకవేళ రూ.5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ డేట్ కి రూ.3.54 లక్షలు వస్తాయి. అంతే దాదాపు మీకు వడ్డీ రూపంలో రూ.55 వేల వరకు వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసే సొమ్ము ఐదేళ్లలో రూ.3 లక్షలు అవుతాయి. పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ లో చేరితే లోన్ సదుపాయం కూడా ఉంటుంది. లోన్ విడుతల వారీగా చెల్లించొచ్చు.. లేదా ఒకేసారి చెల్లించొచ్చు. పోస్టాఫీస్ కి వెళ్లి ఈ స్కీమ్ వివరాలు తెలుసుకొని చేరవొచ్చు. ఈ స్కీమ్ లో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ సదుపాయం కూడా ఉంది.