ప్రమాదకరమని అందరూ భయపడిన పదార్థమూ కొన్నిసార్లు ప్రాణాలను కాపాడుతుంది. అందుకు సాక్ష్యమే ఈ పరిశోధన. ఆస్ట్రేలియాలో కనిపించే ‘ఫనెల్ వెబ్ స్పైడర్’ అనే సాలీడు కాటును విష పూరితంగా భావిస్తారు. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఆ విషమే లక్షల ప్రాణాలను కాపాడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడే వారికి ఓ శుభవార్త చెప్పారు వైద్యులు.
ఆస్ట్రేలియాలో కనిపించే ఫనెల్ వెబ్ స్పైడర్ అనే సాలీడు కాటు విషపూరితంగా అందరూ భావిస్తారు. సమయానికి చికిత్స అందించకపోతే ప్రాణాంతకం అవుతుంది. అయితే ఈ విషయమే లక్షల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. గుండెపోటు వచ్చినప్పుడు ఒక్క సారిగా అవయవానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె కణాలకు ఇక చనిపోయారు అనే సంకేతం అందుతుంది. ఈ సంకేతాన్ని ఆపగలిగితే మాత్రం ప్రాణాన్ని కాపాడినట్లే.
ఫనెల్ వెబ్ స్పైడర్ విషం లోని హెచ్ ఐ-1a అనే ప్రోటీన్ కు ఈ సంకేతాన్ని ఆపగల శక్తి ఉందని రుజువు చేశారు శాస్త్రవేత్తలు. బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేసే సమయంలోను ఈ ప్రక్రియ ఏ మాత్రం ఆలస్యం అయినా గుండె దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సందర్భంలో కూడా హెచ్ ఐ-1a ప్రోటీను చాలా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.