టెక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ చేసిన పనికి పాకిస్తాన్ అట్టుడికిపోయింది. నిరసనలు, దాడులతో కరాచీ మొత్తం హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన శాంసంగ్ కంపెనీ చివరికి దిగొచ్చింది. ఇస్లాం, ప్రవక్తను కించపరిచారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. పాక్‌కు, ఆ దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపింది. దైవదూషణ(బ్లాస్ ఫెమీ)కి పాల్పడ్డారనే ఆరోపణలపై అంతర్గత విచారణకు కూడా ఆదేశించినట్లు ఈ కొరియన్ కంపెనీ వెల్లడించింది.
అసలు ఏం జరిగిందంటే.. శుక్రవారం కరాచీలోని స్టార్ సిటీ మాల్ లో ఓ వైఫై డివైజ్ కారణంగా అసలు రచ్చ మొదలైంది. వాళ్లు తీసుకొచ్చిన ఓ క్యూఆర్ కోడ్ మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఉందంటూ గొడవ చేశారు. ఆ వార్త అక్కడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తద్వారా స్థానికులంతా స్టార్ సిటీ మాల్‌కు చేరుకుని విధ్వంసం సృష్టించారు. ఆ గొడవలో కొందరికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది.
Protest against alleged blasphemy of a WiFi device in Karachi. Mob gathered after a WiFi device installed in Star City Mall, allegedly posted blasphemous comments. Protesters vandalised Samsung billboards accusing the company of blasphemy. Police detained 27 Samsung employees. pic.twitter.com/3R8UYbScqa
— Naila Inayat (@nailainayat) July 1, 2022
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శాంసంగ్ ఉద్యోగులు 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ దాడికి పాల్పడింది.. పాకిస్తాన్ గ్రూపు తెహ్రీక్-ఈ-లుబ్బాయిక్ సభ్యులుగా నిర్ధారించారు. కానీ, వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. పాకిస్తాన్ లో దైవదూషణ అనేది పెద్ద నేరం. ఆ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు, జరిమానా, ఒక్కోసారి ఉరిశిక్ష కూడా పడచ్చు. పరిస్థితిని చక్కదిద్దే చర్యగా శాంసంగ్ కంపెనీ బహిరంగంగా లేఖ విడుదల చేసింది. అన్ని మాతలపై తమకు అత్యంత గౌరవం ఉందంటూ వెల్లడించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Samsung Pakistan – Press Release July 1st, 2022. pic.twitter.com/IVSpAkH8Lm
— Samsung Pakistan (@SamsungPakistan) July 1, 2022