ఆదివారం నేపాల్ దేశంలో చోటుచేసుకున్న విమాన దుర్ఘటన గురించి అందరికి తెలిసిందే. సంక్రాంతి పండగ వేళ ఆదేశంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లో అందులోని ప్రయాణికులు.. తమ గమ్యానికి చేరుకుంటాము అనుకునే సమయంలో సాంకేతి లోపంతో విమానం కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే అందులోని 72 మంది సజీవ దహనం అయ్యారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఓ ఫేస్ బుక్ లైవ్ వీడియో కూడా బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమానం కూలిపోయే సమయంలో అందులోని ఓ ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ లో ఉన్నాడు. అలానే ఓ రష్యన్ బ్లాగర్ కూడా ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఓ సెల్ఫీ దిగింది. ‘గో టూ నేపాల్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేపాల్ జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం చెందారు. యేతి ఎయిర్ లెైన్స్ కు చెందిన ఏటీఆర్-72 విమానం ఖాట్మాండు లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి పొఖారాకు ఆదివారం ఉదయం 10.33 గంటల సమయంలో బయలుదేరింది. 72 మందితో బయలుదేరిని ఆ విమానం మరో 5 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకోనుంది. సరిగ్గా పొఖారా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. స్థానికులు చూస్తుండగానే ఇళ్లపై నుంచి వెళ్తూ.. పొఖారా విమానాశ్రయ సమీపంలోని కొండ ఢీకొట్టి కుప్పకులిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రాణమూ కూడా మిగల్లేదు. అందులోని 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా.. మొత్తం 72 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో 53 మంది నేపాలీలు, ఐదురుగురు భారతీయులు, నలుగురు రష్యన్ లు, ఇద్దరు కొరియన్ లు, ఇద్దరు ఐర్లాండ్ కు చెందినవారు. అంతేకాక ఆఫ్ఘనిస్థాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఈ నలుగురు రష్యన్స్ లో ఓ ప్రముఖ బ్లాగర్ కూడా ఉన్నారు. 33 ఏళ్ల ఎలెనా బండురో అనే రష్యన్ బ్లాగర్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఆమె ఓ సెల్ఫీ దిగారు. అనంతరం “గో టూ నేపాల్” అంటూ తన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తరువాత కొన్ని క్షణాలకే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఈ రష్యన్ మహిళ కూడా మరణించినట్లు నేపాల్ అధికారులు ధృవీకరించారు. దీంతో ప్రస్తుతం ఆ మహిళ దిగిన లాస్ట్ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలానే భారతీయ ప్రయాణికుడు సోను జైస్వాల్ అనే వ్యక్తి కూడా ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
Passenger films when onboard Yeti Airlines aircraft before crashing near Pokhara Airport in Nepal. Via @AmardipSpeaks
Don’t watch if you can’t handle it! pic.twitter.com/2V0EUpnSWp— Ali Hashem علي هاشم (@alihashem_tv) January 15, 2023
ఈ వీడియోలో జైస్వాల్.. విమానంలో కిటికీ పక్కన కూర్చుని తన ఫోన్ ద్వారా ఫేస్ బుక్ లైవ్ స్టీమింగ్ చేస్తున్నాడు. గాల్లో నుంచి కింద కనిపించే సిటీ అందాలను చూపించారు. అంతేకాక విమానం లోపల ఉన్న ప్రయాణికులను చూపించారు. ఆ వీడియో చూసినట్ల అయితే అందరు ఎంతో ప్రశాంతగా ఉన్నారు. కొద్ది సమయంలో తాము గమ్యస్థానానికి చేరుకోనున్నామనే ఆలోచనలో ఉన్నారు. ఇంతలోనే విమానంలో మంటలు రావడం, క్షణాల్లో కూలిపోయి అందరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో ఈ ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత ఆమె ఫోటో, అతడి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం అవుతోన్నాయి. ఈ నేపాల్ విమానా దుర్ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
La bloguera de viajes de Moscú Elena Banduro, de 33 años, publicó esto antes de #NepalPlaneCrash
El accidente se transmitió en vivo desde el interior del avión y también se grabó en video de los espectadores que estaban debajo. #Nepal #15Enero2023 pic.twitter.com/C3WAHIgbLk
— Reporte Global (@RadioReporte) January 15, 2023
उनी Russian नागरिक हुन “Elena Banduro” २४ घन्टा अगाडि मात्रै उनले आफ्नो Story मा share गर्दै “Go to Nepal” लेखेकी थिइन् । नेपाल पुगेको २४ घन्टा नहुदै काठमाडौं बाट पोखरा जाने क्रममा उनी दुर्घटनामा परेकी छन। pic.twitter.com/bniE1QrPfC
— samikshya Devkota (@swomixa) January 15, 2023