అమ్మాయికి పెళ్లి సంబంధం అంటే అటు ఏడు తరాలు.. ఇటు తరాలు చూడాలి అంటారు పెద్దలు. అయితే నేటి కాలంలో సంబంధాలు మ్యాట్రిమెని సైట్లు కుదుర్చుతున్నాయి. దాంతో మనం చేసుకోబోయే వారు మంచివారో మోసగాళ్లో అర్థం చేసుకోవడం కష్టం. తాజాగా ఓ మహిళ ఈ తరహా మోసానికి గురైంది. ఆ వివరాలు..
ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహిళ కథ వింటే.. కొందరికి నవ్వు వస్తుంది.. కొందరు జాలి పడతారు. ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. ఇంతకు ఆ మహిళ కథ ఏంటంటే.. ఆమె బాగా చదువుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యురాలిగా పని చేస్తోంది. బిడ్డ తన కాళ్ల మీద తాను నిలబడ్డది.. ఇక ఆమెకు వివాహం చేయడం మాత్రమే మిగిలుందని తల్లిదండ్రులు భావించారు. తమ కుమార్తెకు అన్ని విధాలా సరిపోయే సంబంధం కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి ఓ సంబంధం గురించి తెలిసింది. అబ్బాయికిపెద్ద ఇల్లు, ఇంట్లో నాలుగైదు ఖరీదైన కార్లు, ఇంటి నిండా పనివాళ్లు ఉన్నారు. ఇంకేముంది మంచి సంబంధం అని భావించారు. పెళ్లి చేశారు. కొన్ని నెలల తర్వాత ఆ మహిళకు అత్తింటి వారి అసలు స్వరూపం తెలిసి.. బిత్తరపోయింది. మోస పోయానని తెలుసుకున్న యువతి.. ఓ యూట్యూబ్ చానెల్‌తో తన గోడును వెళ్లబోసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
పాకిస్తాన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ తను ఎలా మోసపోయిందో సయ్యద్ బాసిత్ అలీ అనే అధికారిక యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. బాధితురాలి పేరు షాజియా. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసి.. డాక్టర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు లాహోర్‌లో సంపన్నులు అత్యధికంగా నివసించే ఓ కుటుంబంతో సంబంధం కుదిరింది. తమది ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ బిజినెస్ అని సదరు కుటుంబం చెప్పడంతో వారి మాటలు నమ్మి.. ఆ సంబంధం ఖాయం చేసుకున్నారు షాజియా కుటుంబ సభ్యులు.
పెళ్లైన ఆరు నెలల పాటు ఆమె జీవితం బాగానే ఉంది. అత్తమామలు.. ఆమెను ఏం పని చేయవద్దని.. హాయిగా ఇంట్లోనే కూర్చుని.. జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెప్పారు. ఖరీదైన ఇల్లు.. ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్, ఫార్చ్యూనర్, ల్యాండర్ క్రూయిజర్ కార్లు, జిమ్ వంటి అత్యాధునిక హంగులతో ఎంతో ఆడంబరంగా ఉండేది. నాలుగైదు నెలల పాటు షాజియా అత్తారింట్లో ఎంతో సంతోషంగా గడిపింది. ఆ తర్వాత ఆమె ఇంట్లో ఉండే వారంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడం గమనించ సాగింది. ముసలి వాళ్లు మొదలు, యువకులు కార్లలో బయటకు వెళ్లేవారు. వారంతా ఎక్కడికి వెళ్తున్నారో షాజియాకు అర్థ కాలేదు. ఆ తర్వాత ఓ రోజు ఆమెకు తమ ఇంటి బేస్‌మెంట్‌లో కనిపించిన ఓ దృశ్యం చూసి గుండెపగిలినంత పనైంది.
ఇంతకు బేస్‌మెంట్‌లో ఏం కనిపించింది అంటే.. బిచ్చగాళ్ల వేషధారణకు అవసరమైన దుస్తులు, మేకప్ సామగ్రి, వస్తువులు కనిపించాయి. వాటిని చూసిన షాజియాకు ఏదో తేడాగా ఉందని అనిపించింది. ఆ తర్వాత ఓ రోజు తన అత్తమామలు, భర్త ఎక్కడకు వెళ్తున్నారో తెలుసుకోవాలని భావించింది షాజియా. ఈక్రమంలో వారు ఒంటరిగావెళ్తుండగా.. వారి వెనకే ఫాలో అయ్యింది. ఆ తర్వాత కనిపించిన సీన్ చూసి ఆశ్చర్యంతో మూర్ఛ పోయింది. ఇంతకు ఆమెకు ఏం కనిపించింది అంటే..
కోటీశ్వరులుగా చలామణి అవుతున్న తన అత్తగారి కుటుంబం అక్కడ రోడ్ల మీద గుంపులుగా చేరి అడుక్కుంటున్నారు. తన అత్త కాళ్లు లేని వ్యక్తిగా, తన భర్త చేతులకు కట్లు కట్టుకుని.. ముందు బొచ్చె పెట్టుకుని.. రోడ్డు మీద పోయే వారిని అయ్యా, బాబు అంటూ అడుక్కోవడం చూసి ఆశ్చర్యపోయింది షాజియా. అంటే తన కుటుంబం మొత్తం అడుక్కోవడానికి వెళ్తున్నట్లు తెలుసుకుంది షాజియా. అంతేకాదు వారిని బిచ్చగాళ్లలా తయారు చేయడం కోసం పర్సనల్ మేకప్ మ్యాన్‌ని కూడా ఏర్పాటు చేసుకుంది వారి కుటుంబం.
ఇక తన అత్తింటి వారు చేసిన మోసం తల్చుకుని నెల రోజుల పాటు ఎంతో ఏడ్చానని.. కుంగిపోయానని వెల్లడించింది షాజియా. అత్తింటి కుటుంబం చేసిన మోసాన్ని యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది షాజియా. తాను ఎంబీబీఎస్ పూర్తి చేసి.. డాక్టర్‌గా పని చేస్తున్నానని.. తనకు డబ్బు కన్నా ఆత్మగౌరవం ముఖ్యం అని తెలిపింది షాజియా. ప్రస్తుతం అత్తింటి నుంచి వచ్చేసి విడిగా ఉంటుంది. అంతేకాక కాబోయే భర్తను చూసి మురిసిపోకుండా.. వారి కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అంటుంది. తనలాగే ఎవరు మోసపోకూడదని అంటుంది షాజియా. ప్రసుత్తం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. పాపం ఆ డాక్టర్ పరిస్థితి అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.