ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడుల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల పలు దేశాల్లో ఉగ్రవాదుల వరుస దాడుల్లో ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసుకొని మిలిటెంట్స్ జరుపుతున్న బాంబుదాడుల్లో సామాన్య పౌరులు సైతం చనిపోతున్నారు. దాడి చేసిన తర్వాత ఫలానా దాడికి కారణం తమ ఉగ్రవాద సంస్థే అంటూ బహిరంగంగా చెబుతున్నారు. తాజాగా పాకిస్థాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. వివరాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా పాకిస్థాన్ లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో ఆత్మాహుతి దాడులు కొనసాగాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్ లో క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి నగరంలో ఓ ఆత్మాహుతి బాంబర్ బైక్ పై అతి వేగంగా వచ్చి పోలీస్ వ్యాన్ ని ఢీ కొట్టాడు.. దీంతో వ్యాన్ పేలిపోయింది. ఈ దారుణ ఘటనలో తొమ్మిది మంది పోలీసులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దళానికి చెందిన వ్యక్తి బైక్ పై అత్యంత వేగంతో వచ్చి పోలీస్ వ్యాన్ ని ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్ హై అమీర్ తెలిపారు.
దాడిలో గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బాంబ్ స్క్వాడ్స్, భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గత వారం రోజుల పాటు పశువుల ప్రదర్శన జరిగింది.. అక్కడ భద్రతా కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పపడింది ఏ గ్రూప్ అన్నది ఇంకా తెలియరాలేదు. గత కొంత కాలంగా బలూచిస్థాన్ లో లభించే గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడి చేస్తుందని ఆరోపిస్తూ.. బెలూచి జాతి గెరిల్లాలు పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
Pakistan: 9 security personnel killed in Bolan suicide blast
Read @ANI Story | https://t.co/zsDw4eQ7fk#Securitypersonnel #Pakistan #Balochistan #Suicidebomb pic.twitter.com/4fUQrjslMb
— ANI Digital (@ani_digital) March 6, 2023