సూడాన్‌లో యుద్ద వాతావరణం భీకరంగా మారుతోంది. ఆర్మీ-పారా మిలటరీ బలగాలు పోటా పోటీగా దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ఈ యుద్ధ కారణంగా 420కిపైగా మంది ప్రాణాలు కోల్పోగా.. 3,700 మందికిపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు.
సూడాన్ దేశంలో ఆర్మీ-పారా మిలటరీ బలగాల మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు 420కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. 3,700 మందికిపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు. సూడాన్ రాజధాని ఖార్టూన్‌లో యుద్ధ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. యుద్దం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సుడాన్‌లోని ఇతర దేశాల పౌరుల్ని అక్కడినుంచి తరలించేందుకు ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. మొదటి విడతలో భాగంగా.. సుడాన్ నుంచి 150 మంది ఇతర దేశాల పౌరులను సౌదీ అరేబియాకు తరలించింది. ఈ 150 మందిలో ఇండియాతో పాటు మొత్తం 12 దేశాల వారు ఉన్నారు.
అంతేకాదు! మంగళవారం 28 దేశాలకు చెందిన మొత్తం 388 మందిని సూడాన్‌నుంచి తరలించింది. ఈ నేపథ్యంలోనే సూడాన్‌లోని మిగిలిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం తన ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ ఆపరేషన్ కావేరీ పేరిట సూడాన్‌లోని భారత పౌరులను స్వదేశానికి తీసుకొస్తున్నాం. దాదాపు 500 మంది పోర్టు సూడాన్‌కు వచ్చారు. ఇంకా చాలా మంది అక్కడికి వస్తున్నారు. వారిని ఇంటికి తీసుకొచ్చేందుకు మా నౌకలు, విమానాలు సిద్ధంగా ఉన్నాయి.
సూడాన్‌లోని ప్రతీ ఒక్క భారతీయుడిని స్వదేశానికి తీసుకువస్తాం’’ అని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 15న సూడాన్‌లో యుద్ధం మొదలైంది. ఆర్మీ-పారా మిలటరీ బలగాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా బయటి దేశాల పౌరులు బిక్కుబిక్కుమంటూ సూడాన్‌లో బతుకుతున్నారు. స్వదేశానికి ఎప్పుడు వెళతామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. మరి, సూడాన్‌లో జరుగుతున్న యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023