నాలుగు దశాబ్దాల కేకుముక్క తాజాగా ఉంటుందా?
అసలు దాన్ని వేలం వేయటానికి కారణమేంటి?
ఆ కేకు ఎక్కడిది?
ఎవరిది? ఎవరు తిన్నది?
ఆకాలం నాటి కేకుముక్కను ‘వేలం’ వేస్తున్నారు అంటే ఏదో విశేషంగా ఉండే ఉంటుంది. నిజమే. ఆ కేకు ముక్కకు అంతటి ఘనత ఉంది మరి. ‘బ్రిటన్ రాణి డయనా పెళ్లి నాటి కేకు’ కావడమే ఆ కేకు ముక్క విశేషం. దీంతో ఆ కేకు ముక్కను దక్కించుకోవటానికి ఎంతోమంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా 1981లో తయారుచేసిన కేక్ అది. దానిపై జులై 29, 1981 అని డేట్ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించి ఉంది. ఈ కేక్ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు అప్పట్లో పంపించగా ఆమె దీన్ని ఓ పూల కేక్ టిన్‌లో భద్రపరిచింది. ఈ టిన్ మూత మీద చేతితో తయారు చేసిన లేబుల్ అంటించి ఉంది. దాని మీద ‘జాగ్రత్తగా పట్టుకొండి – ఇది ప్రిన్స్ చార్లెస్-ప్రిన్సెస్ డయానాల వివాహ కేక్’ అని ఉంది.
స్మిత్ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ముక్క ను ఓ వ్యక్తికి అమ్మగా, ఆయన దాన్ని 2011లో వేలం వేసి మరొకరిని అమ్మాడు. ఇది వేలానికొచ్చింది. గ్యారీ లేటన్ అనే వ్యక్తి 2,565 డాలర్లుకు కొనుక్కున్నారు. ఈ కేక్‌ముక్క వేలం పాట సదర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు.