రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు. అనేక మంది కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని కంపెనీలు తెలిపాయి. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఉద్యోగులు అలవాటు పడ్డారు. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఈక్రమంలో యూరోపియన్ లోని ఓ దేశం మాత్రం “వర్క్ ఫ్రమ్ హోం” ను ఉద్యోగుల హక్కు అని తెలిపింది. అంతేకాక ఏకంగా వర్క్ ఫ్రమ్ హోం ను చట్టబద్దం చేసింది. ఇంతకి ఆ దేశం ఏమిటో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం…
యూరోపియన్ లో ఉన్న ప్రముఖ దేశాల్లో నెదర్లాండ్ ఒకటి. ఇక్కడే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చట్టబద్ధం కానుంది. ఇంటి నుంచి పనిచేసే వెసులు బాటును చట్టబద్ధం హక్కుగా మార్చే దిశగా నెదర్లాండ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందకు సంబంధించిన బిల్లును ఆ దేశ పార్లమెంట్ దిగువ సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. సెనేట్ ఆమోదం కూడా పొందితే వర్క్ ఫ్రమ్ హోం ఈ దేశంలో చట్టబద్ద హక్కుగా పరిణమించనుంది. ఐతే ప్రస్తుతానికి మాత్రం నెదర్లాండ్స్ లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కారణం తెలుపకుండా వర్క్ ఫ్రం హోం చేస్తుంటే దానిని తిరస్కరించే హక్కు యాజమాన్యులకు ఉంటుంది.ఇక కొత్త చట్టం అమల్లోకి వస్తే.. యజమానులు ఇటువంటి అభ్యర్ధలన్నింటినీ కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక వేళ ఉద్యోగులను రిక్వెస్ట్ ను తిరిస్కరిస్తే అందుకుగల బలమైన కారణాలను యాజమాన్యం తప్పని ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. మంచి ఫలితాలను, ప్రయాణ సమయాలను ఆదాయ చేయడానికి కొత్త చట్టం అవకాశం కల్పిస్తుందని అక్కడి నేతలు అంటున్నారు. నెదర్లాండ్స్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ యాక్ట్-2015 కు సవరణ చేయడం ద్వారా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. దీనివల్ల పని గంటలు, షెడ్యూల్, వర్క్ ప్లేస్‌లను మార్చుకోవడానికి ఉద్యోగులకు అవకాశం కల్పిస్తుంది. కాగా కార్మికుల హక్కులకు కాపాడే విషయంలో నెదర్లాండ్స్‌కి ఇప్పటికే మంచి పేరుంది. తాజా చట్టంతో అక్కడి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చూకూరనుంది. మరి.. నెదర్లాండ్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య కన్నుమూత!
ఇదీ చదవండి: Kickboxer: రింగ్‌లోనే కుప్పకూలిన యువ కిక్ బాక్సర్!
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితా నుంచి బయటకు వచ్చేస్తానంటున్న బిల్ గేట్స్!