ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 లో భాగంగా జింబాబ్వే మీద ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న విండీస్ జట్టు.. నెదర్లాండ్స్ మీద ఓటమిని మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 లో భాగంగా విండీస్ జట్టుకి ఏది కలిసి రావడం లేదు. డైరెక్ట్ గా జరిగే ఏ వరల్డ్ కప్ కి డైరెక్ట్ గా అర్హత సాధించలేని విండీస్ జట్టు తమ చరిత్రలో తొలిసారి క్వాలిఫయర్స్ మ్యాచులు ఆడుతుంది. అయితే క్వాలిఫయర్స్ లో ఫేవరేట్ గా దిగిన విండీస్ జట్టుకి పసికూనలు ఊహించని షాకిచ్చాయి. ఆ జట్టు వరుసగా జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి ఇప్పుడు వరల్డ్ కప్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వే మీద ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న విండీస్ జట్టు.. నెదర్లాండ్స్ మీద ఓటమిని మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఇటీవలే విండీస్- నెదర్లాండ్స్ మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో విండీస్ ని నెదర్లాండ్స్ జట్టు సూపర్ ఓవర్ లో ఓడించిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ సమయంలో విండీస్ విజయం నల్లేరు మీద నడకే అని అందరూ భావించారు. అయితే మ్యాచ్ ఆధ్యంతం పసికూన నెదర్లాండ్స్ చూపించిన పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ ఎడ్వార్డ్స్ అర్ధ సెంచరీతో రాణించడంతో మ్యాచ్ ని టై చేసుకోగలిగింది. ఇక మ్యాచ్ సూపర్ ఓవర్ కి దారి తీయడంతో విండీస్ జట్టుకి మ్యాచ్ గెలవడానికి సూపర్ ఓవర్ లో మరో అవకాశం వచ్చింది. అయితే సూపర్ ఓవర్ లో విండీస్ ఘోర పరాజయం చవి చూసింది. ఏకంగా 22 పరుగుల తేడాతో ఓడిపోయి దాదాపు వరల్డ్ కప్ ఆడే అవకాశాలు మరింతగా సంక్లిష్టంగా చేసుకుంది.
ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ కి కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న బ్రాత్ వైట్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు. విండీస్ విజయానికి ఒక బంతికి ఒక పరుగు కావలసిన దశలో”వాన్ బీక్” అవుట్ కావడంతో సంబరాలు చేసుకున్నబ్రాత్ వైట్.. మ్యాచ్ ఓడిపోయిన అనంతరం షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఈ ఓటమిని తట్టుకోలేక కామెంటరీ చేయడం కూడా ఆపేసి బాధపడుతూ కనిపించాడు. తమ క్రికెట్ జట్టుకి ఇలాంటి స్థితి రావడం చూసి తట్టుకోలేకపోయాడు. బ్రాత్ వైట్ ఎంత కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లు ఆగలేదు. ఒకప్పుడు వెస్టిండీస్ జట్టు ప్రపంచ క్రికెట్ ని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన రోజుల నుండి కనీసం ఇప్పుడు వరల్డ్ కప్ కి అర్హత సాధించలేకపోవడం విచారకరం. ఇక రెండు సార్లు టీ 20 వరల్డ్ కప్, రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచినా చరిత్ర విండీస్ జట్టుది. ఇక ఈ పరాజయంతో సూపర్ సిక్స్ కి అర్హత సాధించినా.. టాప్ 2 లో నిలవడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో బ్రాత్ వైట్ ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అవుతుంది. మొత్తానికి బ్రాత్ వైట్ తమ జట్టు పరాజయం చూడలేక ఎమోషనల్ అవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.