ఈ మద్య కొంత మంది క్రీడాకారులు అనుకోకుండా కన్నుమూయడంతో క్రీడారంగంలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రింగ్ లోనే ఓ బాక్సర్ కన్నుమూయడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం వల్లనే తమ కొడుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ జులై 10న నిర్వహించారు. రింగ్ లో కొంత సేపు ప్రత్యర్థులు హోరా హోరీగా పోరాడారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి మొహంపై పంచ్ ఇవ్వగానే కిందపడిన నిఖిల్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.
అక్కడ ఉన్న సిబ్బంది అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రింగ్ లో కిందపడిన నిఖల్ కి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం వల్లనే కోమాలోకి మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సురేష్ ఫిర్యాదు మేరకు జ్ఞానభారతి పోలీసులు సెక్షన్ 304-ఏ కింద కేసు నమోదు చేసుకున్నారు.
ఇది చదవండి: Tirupathi: తండ్రే తగలెట్టాడు.. అయినా! చనిపోయే ముందు తండ్రిని చూడాలంటూ..
Nikhil , a 23-yr old kickboxer died after being hit by an opponent while taking part in a competition in #bengaluru
Video shows him lying motionless in the ring
Coach says He could have been saved if there were medical personnel/ambulance on site
Family seeks action pic.twitter.com/gcCVbvVUdx
— Sidharth.M.P (@sdhrthmp) July 14, 2022