Tirupathi: భార్యపై కోపంతో తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన కన్న కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కన్నుమూశాడు. తన తండ్రే తనను తగలబెట్టాడని తెలిసినా ఆ చిన్నారి.. తండ్రిని చూడాలంటూనే మృత్యుఒడిలోకి చేరాడు. వివరాలు.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ, ఆంధ్ర వాడకు చెందిన రమేష్, ఐశ్వర్య భార్యాభర్తలు.
వీరికి మహేష్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ మనస్పర్థల కారణంగా గత కొంతకాలం నుంచి తరచూ గొడవలు పడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళుతూ, వస్తూ ఉన్నారు. గత సోమవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య అదే గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఫుల్లుగా మద్యం తాగి ఉన్న రమేష్ భార్య ఇళ్లు విడిచి వెళ్లిపోవటం సహించలేకపోయాడు.
భార్య మీద కోపాన్ని బిడ్డ మీద చూపించాడు. మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు ఇది గమనించి బాలుడిని రక్షించారు. వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. గత రెండు రోజులుగా మహేష్ అక్కడే చికిత్స పొందుతున్నాడు.
తన తండ్రే తనను పెట్రోల్ పోసి కాల్చాడని తెలిసినా.. ఆ చిన్నారి తండ్రిని చూడాలని పరితపించాడు. ‘నాన్నను చూడాలని ఉంది’ అని కోరాడు. కోరిక తీరకుండానే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మహిళపై 8 ఏళ్లుగా అత్యాచారం.. 14సార్లు అబార్షన్!