దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మానవ మృగాళ్లు ఏ మాత్రం భయపడడం లేదు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. వయసుతో సంబంధం లేకుండా రెచ్చిపోతున్నారు దుర్మార్గులు. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా దేశంలో ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ దుర్మార్గుడు మహిళపై అత్యాచారం చేసి పద్నాలు సార్లు అబార్షన్. ఆ నీచుడి బాధలు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
జైత్పుర్లోని అర్పణ్ విహార్ ప్రాంతంలో బాధితురాలు(33) జీవిస్తుంది. కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వారు ఇద్దరూ హాస్టల్ లో చదువుతున్నారు. జూలై 5 న బాధితురాలు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. పోలీసులు విషయం తెలియడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ఎయిమ్స్‌కు తరలించారు. మహిళ ధరించిన దుస్తుల్లో ఒక సూసైడ్ లెటర్ కనిపించడంతో దాన్ని పోలీసులకు అప్పగించారు వైద్యులు.
ఇక చనిపోయే ముందు మృతురాలి రాసిన నోట్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నోయిడాలో గౌతమ్ అనే ఓ వ్యక్తి సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం తనను ట్రాప్ చేసి తనను లైంగికంగా వాడుకున్నాడని.. ఎనిమిది సంవత్సరాలుగా పలుమార్లు అత్యాచారం చేశాడని.. అంతేకాదు పద్నాలుగు సార్లు తనకు అబార్షన్ చేయించాడని లెటర్ లో పేర్కొంది. అంతేకాదు అతడు చేసిన తప్పులకు సంబంధించిన వివరాలు మొత్తం తన సెల్ ఫోన్ లో ఉన్నాయని మహిళ రాసుకొచ్చింది. నోట్ ఆధారంగా నింధితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది చదవండి: ప్రియుడితో కలిసి భర్త హత్య.. కానీ, ఆ ఒక్క తప్పు పట్టించింది!