సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సినిమాలు ఉంటాయి.. అలాంటి సినిమాల్లో ‘టైటానిక్’ మూవీ ఒకటి. ఈ మూవీ లో రోజ్, జాక్‌ల లవ్ స్టోరీ.. క్లయిమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీకి పలు ఆస్కార్ అవార్డులు కూడా దక్కాయి.
టైటానిక్ షిప్ అంటే తెలియని వారు ఉండరు.. 1912లో మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. ఇంగ్లాండులోని సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరానికి వెళుతూ అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొని మునిగిపోయింది. సుమారు 1517 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో చనిపోయారు. దాదాపు ఈ నౌక గురించి విశేషాలు అందరికి తెలుసు ఎందుకంటే టైటానిక్ సినిమాలో ఈ వివరాలు పొందుపరిచారు కాబట్టి. ఈ ఓడ మునిగిపోవడంతో పాటుగా విలువైన ఆభరణాలు, సంపద కూడా సముద్రంలోకి చేరింది. ఈ సంఘటన చరిత్రలో అత్యంత దురదృష్టకరమైనదిగా నిలిచిపోయింది.
ఈ సంఘటనపై అనేక నవలలు, సినిమాలు వెలువడ్డాయి. కొందరు రచయితలు నౌకలో ప్రయాణించిన వ్యక్తులను కలిసి వారి అనుభవాలను అభివర్ణిస్తూ పుస్తకరూపంలో విడుదల చేశారు. అలాగే ‘టైటానిక్’ పేరు మీదుగా ఒక సినిమా కూడా తీశారు. ఈ సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. అందులో రోజ్, జాక్‌ల లవ్ జర్నీ ప్రేక్షకులను కట్టిపడేసింది. టైటానిక్ మూవీ లోని సాంగ్ ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో భారీగా వసూళ్లను చేసింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ఈ మూవీలో హీరోయిన్ ఓ నక్లెస్ ధరిస్తుంది.. అలాంటిదే టైటానిక్ శిథిలాల్లో 111 సంవత్సరాల అనంతరం వెలుగుచూసింది. ఆ నెక్లెస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాగెల్లాన్ అనే సంస్థ రెండు సబ్ మెరైన్ల సాయంతో సముద్రంలో మునిగిన టైటానిక్ నౌక అవశేషాలను ప్రతి కోణం నుంచి లక్షలకొద్ది చిత్రాలు తీసి వానిని త్రీడీ మోషన్ పిక్చర్స్‌గా మారుస్తోంది. ఇది చరిత్రలోనే పెద్ద గ్రౌండ్ వాటర్ స్కానింగ్ అని నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో బంగారు నెక్లెస్ చిత్రాల ద్వారా బయటపడింది. ఆ నక్లెస్‌ను బయటకు తీయడం కుదరని పని. అంతరించిపోయిన అతిపెద్ద సొరచేప దంతంతో ఈ నక్లెస్‌ను తయారుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెటిజన్స్ సాయంతో మాగెల్లాన్ సంస్థ ఆ నక్లెస్ ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.