వరుస ప్రమాదాలు, మరణాల వార్తలతో సినీ పరిశ్రమలో తీవ్ర అలజడి నెలకొంది. అనారోగ్యంతో టైటానిక్ యాక్టర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి టైటానిక్ చిత్ర బృందంతో పాటు అభిమానులు, హాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
వరుస ప్రమాదాలు, మరణాల వార్తలతో సినీ పరిశ్రమలో తీవ్ర అలజడి నెలకొంది. కొద్ది రోజులుగా ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ బోస్ వెంకట్ సోదరి, ఆ వెంటనే సోదరుడు కన్నుమూయడంతో అంతా షాక్‌కి గురయ్యారు. బోయపాటి శ్రీను శిష్యుడు, టాలీవుడ్ యువ దర్శకుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల తండ్రి కన్నుమూశారు. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగులో ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలికి గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. అలాగే ప్రముఖ కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ రిలేటివ్, యువ కన్నడ నటుడు సూరజ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కుడి కాలు నుజ్జు నుజ్జయింది. దీంతో మోకాలి వరకు కాలిని తొలగించారు. సోషల్ మీడియా ఫేమ్, యూట్యూబర్, ప్రముఖ హాస్యనటుడు దేవరాజ్ పటేల్ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు.
తాజాగా మరో ప్రముఖ నటుడు ఇకలేరు అనే వార్త మరోసారి చిత్ర పరిశ్రమ వర్గాల్లో విషాదం నింపింది. జేమ్స్ కెమరూన్ అద్భుత దృశ్యకావ్యం ‘టైటానిక్’ గురించి తెలియని వారుండరు. ఆ చిత్రంలో నటించిన లేవ్ పాల్టర్ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. గతకొద్ది కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన మే 21న లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు నెల రోజుల తర్వాత పాల్టర్ కుమార్తె తమ తండ్రి మరణించిన విషయాన్ని మీడియాకి వెల్లడించారు.
‘Titanic’ actor Lew Palter dead at 94
Lew Palter, the actor best known to audiences as Macy’s co-owner Isidor Straus in the 1997 classic “Titanic,” died last month, it was revealed Monday. He was 94. Palter succumbed to lung cancer on May 21, his daughter Catherine told The… pic.twitter.com/mq5Oi7N7ON— Dr.LyndaBarnes (@MrsBarnesII) June 27, 2023