1997లో వచ్చిన టైటానిక్ సినిమా ఎంతటి విజయాన్ని సొంత చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన ప్రతీ చోటా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు అయింది.
టైటానిక్ షిప్ గురించి ఈ ప్రపంచంలో తెలియనివారు ఉండరు. ప్రపంచంలోనే అతి పెద్ద ఓడగా.. విషాదానికి కేరాఫ్ అడ్రస్‌గా చరిత్రలో ఓ చెరిగిపోయిన అధ్యాయంలా మిగిలిపోయింది. సముద్రపు లోతుల్లో గత వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. 1912 ఏప్రిల్ 15న 2 వేలకు పైగా ప్రయాణికులతో వెళుతున్న టైటానిక్ షిప్ ప్రమాదానికి గురైంది. ఓ భారీ మంచు గడ్డను ఢీకొట్టింది. రెండుగా చీలి నార్త్ అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ ప్రమాదంలో 1500 మంది మృత్యువాత పడ్డారు. టైటానిక్ సముద్రంలో మునిగిపోయినా.. దాని గురించి ప్రజలు మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే మునిగిపోయిన తర్వాతే దానికి గుర్తింపు వచ్చింది. 199ంలలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ టైటానిక్ విషాదాంతంలో ఓ సినిమా తీయాలనుకున్నారు.
‘టైటానిక్’ సినిమాకు శ్రీకారం చుట్టారు. 1997లో లియోనార్డో డెకాప్రియో, కేట్ విన్స్లెట్ జంటగా ‘టైటానిక్’ సినిమా వచ్చింది. విషాదకరమైన ప్రేమ కథగా ఆ సమయంలో ఎన్నో రికార్డులను సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు జేమ్స్ క్యామెరూన్కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక, ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 10 వ తేదీకి 25 ఏళ్లు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా టీం ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. 1986ల నాటి టైటానిక్ షిప్ వీడియోను విడుదల చేసింది. ఓ బృందం సముద్రం అడుగులోకి వెళ్లి.. టైటానిక్ ఓడను వీడియో తీసింది. ఓ భాగాన్ని అప్పుడే విడుదల చేసింది. మరో భాగాన్ని అట్టే పెట్టింది.
In celebration of the @TitanicMovie 25th anniversary, we’ve got another #Titanic treat for you: previously-unreleased footage from the #RMSTitanic shipwreck, filmed by #HOVAlvin and #ROVJasonJr. Sign up for the YouTube premiere this Weds 2/15 at 7:30pm ET: https://t.co/lIQLqsu3MF pic.twitter.com/qoTn59X1fV
— Woods Hole Oceanographic Institution (WHOI) (@WHOI) February 13, 2023
ఇక, ఆ వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. దాదాపు గంటకుపైగా ఆ వీడియో ఉంది. టైటానిక్ శకలాలు సముద్రంలో పాచి పట్టిపోయి ఉన్నాయి. ఇది దాదాపు 30 ఏళ్ల నాటి వీడియో.. ప్రస్తుతం టైటానిక్ ఇంకా పాడైపోయి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే రెండు మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది. వేల సంఖ్యలో జనం వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. పాత వీడియోను విడుదల చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.