టైటాన్ గల్లంతైన విషయం ప్రపంచం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అందరు టైటాన్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉదంతం విషాదాంతం మిగిల్చింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ షిప్ శకలాలను గుర్తించడానికి.. టైటాన్ మినీజలాంగర్గామిలో బయలుదేరిన ఐదుగురు చనిపోయారని అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
టైటాన్ గల్లంతైన విషయం ప్రపంచం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అందరు టైటాన్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉదంతం విషాదాంతం మిగిల్చింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ షిప్ శకలాలను గుర్తించడానికి.. టైటాన్ మినీజలాంగర్గామిలో బయలుదేరిన ఐదుగురు చనిపోయారు. టైటాన్ శకలాలను టైటానిక్ షిప్‌కి సమీపంలోనే గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కొనసాగుతున్న అన్వేషణ లో ఆక్సిజన్ దగ్గరపడుతున్న సమయంలో ప్రకటన వెలువడింది.
అమెరికా తీర రక్షక దళం తెలిపిన వివరాల ప్రకారం.. వారు సముద్రం అడుగున పంపిన రిమోటెడ్ ఆపరేటెడ్ వెహికిల్ నీటి అడుగున పడిఉన్న శకలాలను గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్‌వే అని ప్రకటించింది. రక్షక దళం సంస్థ చీఫ్ ఫైలట్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ప్రయాణికులైన షహ్‌జాదా దావూడ్, ఆయన కొడుకు సులేమాన్ దావూద్, హామిష్ హార్డింగ్, పౌల్-హెన్రీ నర్గిమెలెట్ మృతి చెందారని ఓషన్ గేట్ తెలిపింది. వారు ఎలా మృతి చెందారన్న విషయం వెల్లడించలేదు.
ఆదివారం ఉదయం బయలుదేరే సమయానికి టైటాన్‌లో దాదాపు 96 గంటలపాటు శ్వాసించేందుకు సరిపడా ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కూడా అయిపోయింది. గురువారం ఉదయం వరకు జలాంతర్గామిలో ప్రాణవాయువు అయిపోయినట్లుగా నిపుణులు తెలుపుతున్నారు. అయితే టైటాన్ గల్లంతైన రోజే వారు మరణించారా? లేదా అనేది తేల్చలేకపోతున్నారు. టైలాన్ ఆదివారం ఉదయం కెనడాలో న్యూఫౌండ్‌లాండ్ నుండి 700 కిలో మీటర్ల దూరం సముద్రంలో గల్లంతైన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు టైటాన్ పడిఉన్న ప్రాంతాన్ని గుర్తించడం అమెరికా తీర రక్షక దళానికి ఒక సవాలుగా మారింది. అమెరికా కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో తీవ్రంగా అన్వేషించింది. సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని నౌకలు, విమానాలను టైటాన్ అన్వేషణ కొరకు రంగంలోకి దించారు. టైటాన్‌ను కనుగొనుటకు ఫ్రెంచ్ పరిశోదక సంస్థ కెమెరాలు,లైట్లతో కూడిన డీప్-డైవింగ్ రోబోట్‌ను కూడా సముద్ర గర్భంలోకి పంపింది.