బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుక లో అత్యంత ఖరీదైన వజ్రాల నక్లెస్ ధరించింది.. దీని ధర తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే..
ప్రియాంక చోప్రా.. సీనీ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ప్రియాంక చోప్రా 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది. తమిళన్ అనే తమిళ మూవీలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2003 లో అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పైద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది. తాజాగా గే అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుక -2023లో ప్రియాంక చోప్రా ధరించిన నక్లెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
న్యూయార్క్ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుక -2023 నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తారల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వేడుకలో తొలిసారి ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనాస్ కనిపించారు. అయితే ప్రియాంక చోప్రా ధరించిన అతి ఖరీదైన డైమండ్ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియాంక చోప్రా డిజైనర్ వాలెంటినో రూపొందించిన బ్లాక్ గౌన్ లో ఎంట్రీ ఇచ్చింది.. అందరి లుక్స్ ప్రియాంక పైనే పడ్డాయి. దీనికి కారణం ఆమె అందమే కాదు.. చూపరులను కట్టిపడేసే బ్లాక్ గౌన్ తో పాటు తను ధరించిన డైమండ్ నెక్లెస్ హాట్ టాపిక్ గా నిలిచింది.
ఈ నెక్లెస్ బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు ఉంటుందని అంచనా. 25 మిలియన్నల బల్గేరియా ఫీషియల్ నెక్లెస్ వేలం వేసే అవకావం ఉందని అంటున్నారు. ప్రియాంక ఈ ఈవెంట్ కి మూడోసారి హాజరవగా.. తన భర్తతో కలిసి తొలిసారిగా నల్ల దుస్తులలో మెరిసిపోయారు. ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ గా అమెరికన్ వెబ్ సిరీస్ కు సిరీస్ సిటాడెల్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇంకా ఈ ఈవెంట్ లో అలియా భట్, రిలయన్స్ అధినేత కుమార్తె ఇషా అంబానీ మెరిసి ప్రేక్షకులను మైమరపించారు. ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన దుస్తుల్లో అతివలు సోయగాలను ఆరబోసి సందడి చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో “మెట్ గాలా” ఈ సారి ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేసింది. 2019 సంవత్సరంలో మరణించిన జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్ కు నివాళులర్పించింది.
Met Gala 2023: How Priyanka Chopra Spent The “First Monday In May” https://t.co/HTTBUQFN09 pic.twitter.com/74d2Wel4do
— NDTV Movies (@moviesndtv) May 2, 2023