ప్రియాంక చోప్రా.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండారు. బాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి. ఆ తరువాత హాలీవుడ్ లో స్థిర పడిపోయింది. తరచూ హాట్ కామెంట్స్ చేసే ఈ బ్యూటీ.. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది.
ప్రియాంక చోప్రా.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండారు. బాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి. ఆ తరువాత హాలీవుడ్ లో స్థిర పడిపోయింది. ప్రస్తుతం హాలీవుడ్ ఈ భామ బిజీబిజీగా ఉంది. అయితే గతంలో బాలీవుడ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చాలా సార్లు ఓపెన్ గా మాట్లాడింది. తొలి రోజుల్లో చాలా మంది ఆమె రంగుపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ విషయంపై ప్రియాంక గతంలోనే తెలిపింది. అయితే తాజాగా ఓ బాలీవుడ్ దర్శకుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ఇచ్చింది.
ప్రియాంక చోప్రా.. తన నటనతో, అందంతో యువత హృదాయలను కొట్టేసింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్తుండే అందరు సంతోషించారు. ఆమెకు పెళ్లైన విషయం తెలిసి ఎంతో మంది కుర్రాళ్ల మనస్సు పగిలిపోయింది. అలాంటి భామ తరచూ ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్ని.. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. తన ప్రపంచ సుందరి కిరీటం గెలిచినప్పుడు.. నిక్ జోనస్ ఎలా ఉన్నాడనే విషయాలను ఇటీవలే వెల్లడించింది. అయితే తాజాగా ఓ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసింది.
ఓ ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ..” నేను అప్పుడే బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. అదే సమయంలో ఒక సినిమాకి కూడా అంగీకరించాను. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు నీ లోదుస్తులన్నీ తీసేయాలి అన్నాడు. అండర్ వేర్ చూపించమని అడిగితే నాకు చాలా కోపం వచ్చింది. అలానే ఏం చేయాలో అర్థం కాక చాలా సమయంలో పాటు ఒంటరిగా ఉన్నాను. చివరకు కూడా డైరెక్ట్ చెప్పిన దానికి ఒప్పుకోలేదు. అంతేకాక ఆ మరుసటి రోజే ఆ ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకున్నాను.
అలా మాట్లాడిన వ్యక్తి సినిమాలో నాకు నటించడం ఇష్టం లేదు’ అంటూ ప్రియాంక చోప్రా తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఆ సమయంలో నిరసన తెలిపేందుకు భయపడ్డానని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఈ విషయంపై చాలా బాధ పడినట్టుగా ప్రియాంక వెల్లడించింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రియాంకకు వివాహమైంది. ప్రస్తుతం ఇద్దరు.. తమ వైవాహిక జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మరి.. ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.