బాలీవుడ్ అగ్ర నాయికల్లో ప్రియాంక చోప్రా ఒకరు. తన అందం అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2000 సంత్సరంలో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ లో చాలా సినిమాలు చేశారు. ఇటీవల ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ అవార్డుల్లో సైతం పోటీపడి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు.. నాటు.. పాటకి ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. తెలుగు సినిమాని ప్రపంచం స్థాయికి తీసుకెల్లిన ఘనత ఆర్ఆర్ఆర్ సినిమాకు దక్కుతుంది. మరి ఇలాంటి సినిమాపై ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఆర్ఆర్ఆర్ సినిమాపై నటి ప్రియాంక చోప్ర కీలక వ్యాఖ్యలు చేసింది. తను నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ ప్రియాంకను ఆర్ఆర్ఆర్ సినిమా చూశారా మీకు ఎలా అనిపించిందని ప్రశ్నించారు.
దీనికి ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ సినిమా చూసేంత సమయం, తీరిక నాకు లేదు అని చెప్పింది. అలాగే నేను ఎక్కువగా టీవీ షోలు చూస్తాను, సినిమాలు చూడను అంటూ వెల్లడించింది. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్స్ ఆమెను ట్రోలింగ్స్ చేస్తున్నారు. భారతీయ సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసే టైం లేకపోవడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపక్క ప్రపంచ దేశాలు మన సినిమా ను పొగుడుతూ ఉంటే.. నువ్వు ఇలా సినిమా చూసే సమయం కూడా లేదు అనడం కరెక్టు కాదు అంటూ ప్రియాంకపై కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హాలీవుడ్ గాయకుడు, నటుడు నిక్ జోనస్ తో ప్రేమలో పడి కొన్నేళ్ల సహజీవనం తరువాత పెద్దలను ఒప్పించి 2018లో పెళ్లి చేసుకున్నారు. గతేడాది ఒక పాపకు జన్మనిచ్చారు ఈ జంట.
” I did not watch #RRR yet because I didn’t find time to watch it. I generally prefer watching shows over movies”
— Movies4u Official (@Movies4u_Officl) May 17, 2023