ప్రస్తుతం మన చిత్రాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. పరిధి మించి పోతుంది. హాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్‌లో నటిస్తున్నారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం బాలీవుడ్ నుండి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కి వెళ్లి స్థిర పడిన నటీమణులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడయితే బాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్‌కు హీరోయిన్లు దిగుమతి అవుతున్నారు కానీ.. ఒకప్పుడు ఇక్కడి నుండి హీరోయిన్స్ అక్కడకు వెళ్లారు. ప్రస్తుతం మన చిత్రాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. పరిధి మించి పోతుంది. హాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్‌లో నటిస్తున్నారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం బాలీవుడ్ నుండి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2017లో బేవాచ్ లో నటించిన సంగతి విదితమే. తర్వాత టీవీ షోస్, పలు వెబ్ సిరీస్‌లు నటించింది. ప్రస్తుతం సీటాడెల్ సిరీస్ టో మన ముందుకు వచ్చింది భామ.
అయితే ప్రముఖ పాప్ సింగర్ బియాన్సే షోలో ఇటీవల పాల్గొన్నారు ప్రియాంక చోప్రా. లండన్లో జరిగిన ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కి తన తల్లి మధు చోప్రా, స్నేహితులతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అందులో ఓ న్యూడ్ ఫోటో కూడా ఉంది. ఈ సందర్భంగా బియాన్సేను పొగడ్తలతో ముంచెత్తుతూ ఓ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ గ్లోబల్ స్టార్ హాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు చేసింది. ఇటీవల బాలీవుడ్ గురించి కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేసిన సంగతి విదితమే. అక్కడ రాజకీయల్లో ఇమడలేక.. బాలీవుడ్ నుండి తప్పుకున్నట్లు చెప్పిన సంగతి విదితమే.
తమిళ చిత్రం తమీజాతో ప్రియాంక చోప్రా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యింది మాజీ ప్రపంచ సుందరి. 2013లో రామ్ చరణ్ కి జంటగా జంజీర్ చిత్రం చేశారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ మూవీ చిత్రీకరించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే హాలీవుడ్ కు మాకాం మార్చారు. ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. నిక్ వయసులో ప్రియాంక కంటే 10 ఏళ్ళు చిన్నవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. లాస్ ఏంజెల్స్ లో లగ్జరీ హౌస్ కొన్న ప్రియాంక భర్తతో అక్కడే కాపురం పెట్టారు. సరోగసి ద్వారా ప్రియాంక ఓ పాపకు తల్లయ్యారు. చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫరాన్ అఖ్తర్ మూవీలో నటించబోతోంది.