ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ అనేక హైడ్రామాల మధ్య ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ట్విట్టర్ విషయంలో అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాజాగా ఎలన్ మస్క్ ట్విట్టర్ విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కొన్ని ట్విట్టర్ అకౌంట్ల విషయంలో ఛార్జీలు వసూలు చేయాలనే నిర్ణయానికి మస్క్ వచ్చారు. ట్విట్టర్ వినియోగదారులకు స్వేచ్ఛ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవంటూ ప్రకటించిన మస్క్.. ఆ స్వేచ్ఛను కొన్ని వర్గాలకు మాత్రం ఉచితంగా అందించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
ట్విట్టర్ ఇప్పటివరకు ఫ్రీ సోషల్ మీడియా యాప్ గా ఉంది. దీని ద్వారా అనేక మంది తమ అభిప్రాయాలను, సమాచారాన్ని షేర్ చేసుకుంటుంటారు. ఇలా ట్విట్ చేసినందుకు ఎటువంటి ఛార్జీలు వసూలు ఉండేది కాదు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం కొంత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ వసూల్ అందరికి కాదు. కేవలం కమర్షియల్ ప్రభుత్వ అకౌంట్ల విషయంలో మాత్రమే ఫీజు వసూల చేయాలనే నిర్ణయానికి వచ్చారు కొత్త బాస్. ఈ ఫీజులు ఏమేర ఉంటాయనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. సామాన్య యూజర్స్‌కి ట్విటర్ సేవలు ఉచితమే, బహుశా ప్రభుత్వ, కమర్షియల్ యూజర్ల విషయంలో స్వల్పంగా ఫీజు వసూలు చేయొచ్చు అంటూ నిర్ణయాన్ని చెప్పకనే చెబుతూ ఎలన్ మస్క్ ఒక ట్వీట్ ద్వారా ప్రకటించాడు.అయితే ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యక్షుడి దగ్గరి నుంచి స్థానిక నేతల దాకా.. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంబంధిత వ్యక్తులు.. ట్విటర్ ద్వారానే పోస్టులతో ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే. మరోపక్క కంపెనీలు సైతం తమ ప్రకటనలకు సోషల్ మీడియాలను వేదికగా చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఫీజులు స్వల్పంగానే ఉంటాయని ఎలన్ మస్క్ చెప్పినప్పటికీ.. ఇదంతా పైసా వసూల్ వ్యవహారమే అని చాలా మంది నెటిజన్లు అభిప్రాయాపడుతున్నారు. మరి..ఎలన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ultimately, the downfall of the Freemasons was giving away their stonecutting services for nothing
— Elon Musk (@elonmusk) May 3, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.