ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాలు ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలి పోయిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అందమైన అడవి.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అక్కడి ప్రకృతిని తిలకించేందుకు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటాయి. ఆ సమయంలో పర్యాటకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు అక్కడి వాగుపై ఫుట్ బ్రిడ్జిని నిర్మించేందుకు సిద్దమయ్యారు. అనుకున్నట్లుగా ఓ ఫుట్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అంతా రెడీ అయ్యింది.. ఈ మేరకు అధికారులు ఫుట్ బ్రిడ్జిని ప్రారంభించారు.
అన్ని ఏర్పాటు పూర్తయి ఫుట్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. అందరూ బ్రిడ్జిపై రాగానే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కూలడంతో అందరూ కిందపడిపోయారు. అదృష్టం కొద్ది వాగులో నీరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన మెక్సికో నగరంలోని క్యూర్నావాకా ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: Car: షాకింగ్ : రోడ్డుకి మధ్యలో పెద్ద గొయ్యి.. గోతిలో పడ్డ కారు!
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వాణి మల్హోత్రా అనే మహిళ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఓ బ్రిడ్జీ ప్రారంభ కార్యక్రమాన్ని స్థానిక మేయర్ ఫుట్ బ్రిడ్జ్ ప్రారంభిస్తుండగా ఈ సంఘటన జరిగిందని.. దాదాపు 20 మంది కింద పడిపోయినట్లు అధికారులు తెలిపారు. వైరల్ వీడియోలో ఫుట్ బ్రిడ్జ్ పై అందరూ నడుస్తుండగా.. అది ఒక్కసారి కుప్పకూలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: Late Night Party: లేట్ నైట్ పార్టీ.. నడిరోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు
బ్రిడ్జీపై అమర్చిన చెక్కలు పట్టుకొని నడిచే క్రమంలో అందరూ చెల్లాచెదురుగా కిందపడిపోయారు. ఈ ఘటనపై నగర మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ వేడుకలో తనతోపాటు వచ్చిన చాలా మంది వంతెనపై నడిచారన్నారు. బరువు ఎక్కువ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mexican footbridge collapses during its inauguration by mayor. Several have been injured, none with serious injuries, reports said.#MexicoCity #MexicanFootbridge pic.twitter.com/LVsSgjVQby
— Vani Mehrotra (@vani_mehrotra) June 8, 2022