కష్టపడి పైకి రావాలనే తపన ఉంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. అనుకున్న రంగంలో రాణించవచ్చు. ఇది అందరూ చెప్పే మాట. మన దేశంలో రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటేనే రాణించగలుతాం అనే అభిప్రాయం ఉంటుంది. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ.. దాన్ని బద్దలు కొట్టారు. చాయ్ వాలాగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ముఖ్యమంత్రిగా.. తరువాత ప్రధానిగా ఎదిగారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. స్వయం కృషితో ఆటోవాలా నుంచి మేయర్ గా ఎన్నికయ్యాడు ఓ వ్యక్తి.
సాధారణ ఆటోడ్రైవరైన శరవణన్ తమిళనాడు, కుంభకోణం మునిసిపాలిటీ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికయ్యాడు. 6వ తరగతి వరకు చదువుకున్న శరవణన్ 10 ఏళ్లుగా కుంభకోణం సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇతను భార్య(దేవి), ముగ్గురు కుమారులతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శరవణన్ చరాస్తుల విలువ రూ. 4.55 లక్షలు, భార్య వద్ద రూ. 25,000 నగదు రూపంలో ఉన్నట్లు అఫిడవిట్ లోపేర్కొన్నారు.
“మేయర్‌గా ఎన్నికవడం తనకు సంతోషమేనని, అయితే ప్రజలకు సేవ చేస్తూ ఆటో నడపడంలో మరింత ఆనందం ఉందని ఆయన చెప్పారు. మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడంపై దృష్టి పెడతానని ఆయన చెప్పారు”. ఇటీవల జరిగిన కుంభకోణం మునిసిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 48 వార్డుల్లో, డీఎంకే మరియు మిత్రపక్షాలు 42 స్థానాల్లో గెలుపొందాయి. శరవణన్ 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. డీఎంకే.. మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించిన తర్వాత, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ శరవణన్‌ను మేయర్ గా ఎన్నుకుంది.
An Auto driver, with a simple background, Mr Ka. Saravanan has been declared the mayoral candidate for Kumbakonam on behalf of the #Congress party pic.twitter.com/YIW6XSqyqf
— Supriya Bhardwaj (@Supriya23bh) March 3, 2022