మీ అకౌంట్లోకి మీకు తెలియకుండానే.. మీవి కాని డబ్బులు వచ్చిపడ్డాయనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ డబ్బుల్ని చూడగానే సంతోషం వేస్తుంది. అది వెయ్యి రూపాయలు అయినా కూడా దాన్ని మనదిలా భావించేస్తాము. దాని కోసం ఎవ్వరూ రాకూడదని అనుకుంటాము. కొంతమంది ఇదేమీ ఆలోచించకుండా ఖర్చుపెట్టేస్తారు. వెయ్యి రూపాయలకే ఇలా ఉంటే.. లక్షలు, కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చిపడితే ఏమవుతుంది. షాక్ తిన్నట్లు అవుతుంది పరిస్థితి. సంతోషంలో గుండె ఆగినా ఆగుతుంది. అచ్చ ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువకుడు. అతడి అకౌంట్లోకి రాత్రికి రాత్రే రూ. 4కోట్లు వచ్చిపడ్డాయి. ఆ డబ్బులతో అతడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అంతా ఖర్చుపెట్టిన తర్వాత అసలు కష్టం వచ్చిపడింది.
ఆ కష్టం ఏంటో తెలుసుకోవాలనుకుంటే స్టోరీ మొత్తం చదివేయండి. అస్ట్రేలియాకు చెందిన 24 ఏళ్ల అబ్డెల్ ఘాడియా అనే యువకుడి అకౌంట్లోకి 2021లో దాదాపు 4 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఉదయం నిద్ర మేల్కొన్న తర్వాత అకౌంట్లో బ్యాలెన్స్ చూసి అతడు షాక్ అయ్యాడు తనను తానే నమ్మలేకపోయాడు. అయితే, ఆ డబ్బులు ఎవరివి? ఎందుకు నా అకౌంట్లో వచ్చి పడ్డాయి? అని అతడు ఆలోచించలేదు. వెంటనే షాపింగ్ చేయటం మొదలుపెట్టాడు. విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టాడు. పెద్ద మొత్తంలో బంగారం కూడా కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత పోలీసుల అతడి దగ్గరకు వచ్చాడు. డబ్బుల గురించి ప్రశ్నించారు. తాను డబ్బు మొత్తం ఖర్చు చేసినట్లు చెప్పటంతో అరెస్ట్ చేశారు.
కోర్టులో హాజరుపర్చారు. అప్పుడు అతడికి అసలు నిజం తెలిసింది. అస్ట్రేలియాకు చెందిన ఓ జంట ఇళ్లు కొనుక్కోవటానికి ఆ డబ్బుల్ని దాచుకుంది. ఇళ్లు కొనటం కోసం అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. డబ్బులు తాను చెప్పిన ఓ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయమని బ్రోకర్ వారితో అన్నాడు. వాళ్లు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగా.. ఆ నాలుగు కోట్ల రూపాయలు పొరపాటున అబ్డెల్ అకౌంట్లో పడ్డాయి. బ్యాంకు వాళ్లు అబ్డెల్ గురించి తెలుసుకోవటానికి ఆలస్యం చేయటంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. డబ్బులు మొత్తం ఖర్చు చేయటంతో అబ్డెల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరి, తనది కాని డబ్బుతో జల్సాలు చేసి జైలు పాలైన అబ్డెల్పై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.