తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన నటుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుదిశాల వ్యాపింపచేశారు. తెలుగు వారి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతేకాక తెలుగు దేశం పార్టీని స్థాపించి.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే ఈ 2023 మే వరకు తారకరామారావు జయంతి వేడుకలను కన్నుల పండగగా నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికాలో మొట్ట మొదటి సారి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని నూజెర్సీ స్టేట్ లోని ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
అమెరికాలో పలు నగరాల్లో తెలుగు వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాంటి నగరాల్లో ఎడిసన్ నగరం ఒకటి. చాలా మంది తెలుగు వారు తమ అమెరికా ప్రయాణాన్ని ఈ నగరం నుంచి ప్రారంభించారు. చాలా మంది తెలుగు వారు మొదట ఎడిసన్ నగరానికి వచ్చి.. అక్కడి నుంచి ఇతర నగరాలకు వెళ్లి.. నివాసం ఉండే వారు. అందుకే ఈ నగరానికి తెలుగు వారితో చాలా అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ నగరంలో మహానేత తారక రామరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక తెలుగు వారు ముందుకు వచ్చారు. భారతీయ చలనచిత్రంలో ప్రముఖ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ గారు న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతిపాదనను తీసుకున్నారు. ఆయన తీసుకున్న గొప్ప ఆలోచన అమెరికాలోని మిలియన్ల మంది తెలుగు అభిమానులను ప్రేరేపించింది. అంతేకాక వారు ఆయన తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతును తెలిపారు.
ఈ క్రమంలోనే అక్కడ తెలుగు ఎడిసన్ సిటీ మేయర్ కి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనను వారు పంపారు. దీంతో ప్రతిపాదను ఎడిసన్ సిటీ మేయర్ సమీక్షించి.. అంగీకరించారు. అంతేకాక విగ్రహా ఏర్పాటుకు అనువైన స్థలాన్ని చూడాలని అధికారులను అదేశించారు. సామ్ జోషి ఎడిసన్ నగరంలో భారత దేశానికి చెందిన మొదటి మేయర్. ఎడిసన్ న్యూజెర్సీ నగరానికి చెందిన సాంస్కృతిక, కళా కమిటీ సభ్యుడు ఉజ్వల్ కుమార్ కస్తాల, మేయర్‌తో కలిసి భూమి గుర్తింపును అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. అమెరికాలో బహిరంగ ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్ నిధులు సమాకూరుస్తుంది. ఎడిసన్ నగరంలోని స్థానికులు చాలా మంది కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీ అట్లూరి, స్వాతి అట్లూరి, నాసా, తానా సంస్థ, అంజియ చౌదరి, రవి పొట్లూరి మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రామరావు గారు చేసిన సేవ కార్యక్రమాలు, సంస్కరణలను తెలుగు ప్రజలు ప్రతిచోటా గుర్తుంచుకుంటారని అన్నారు. అమెరికాలో ఆయన విగ్రహం ప్రతిష్టించడం ప్రతి భారతీయుడు, ముఖ్యంగాతెలుగు ప్రజలు గర్వించేలా మరొక గొప్ప విజయం అవుతుంది. ఇది భారతీయ వైభవవాన్ని ప్రపంచమంతటా ప్రదర్శించడానికి మార్గం అవుతుంది. మరి.. అమెరికాలో తొలిసారి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కానుండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.