సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట క్షణాల్లో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.
ఈ మద్య సోషల్ మీడియాల వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ఇతర రంగాల్లో పాపులర్ అయిన వాళ్లకు ఏం జరిగినా దానికి సంబంధించి వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అమెరికా అధ్య క్షుడు జో బిడెన్ ఓ వేడుకలో స్టేజ్ పై తులి కిందపడిపోయారు.. ఇంకేముంది దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
కొలరాడోలోని అమెరికా ఎయిర్స్ ఫోర్ అకాడమీలో గ్రాడ్యూయేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్ విచ్చేశారు. ఈ సందర్భంగా స్టేజ్ పై ఆయన అనుకోకుండా కాలు జారి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది ఆయనను పైకి లేపారు. ఆ తర్వాత తాను పడిన వైపు చూపిస్తూ సిబ్బందికి ఏదో చెప్పారు జో బైడెన్. ఆ తర్వాత తనకు కేటాయించి సీట్లోకి వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో ప్రెసిడెండ్ బైడెన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధిచిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
గతంలో కూడా బైడెన్ సైకిల్ తొక్కుతూ హఠాత్తుగా బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వచ్చి ఆయనను పైకి లేపారు. అప్పుడు కూడా ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. బైడెన్ సైకిల్ పై డెలావేర్ లోని రెహూబాత్ బీచ్ హూమ్ కి తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక స్టేజ్ పై జో బైడెన్ పడిపోయిన వీడియో చూసి ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. నిజంగా బైడెన్ కిందపడిపోయారా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది.. గాయాలు ఏమైనా అయ్యాయి అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు బైడెన్ వయసు సంబంధింత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.