పాశ్చాత్య దేశాల సంస్కృతి, సంప్రదాయాలు అందరకీ విదితమే. పరాయి వారితో హగ్గులు, ముద్దులు పెట్టుకోవటం అన్నది సర్వసాధారణం. మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, అమెరికా ప్రథమ మహిళ ‘జిల్ బైడెన్’.. కమలాహ్యారిస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్‌ను ముద్దాడారు. ‘ముద్దాడారు’ అంటే బుగ్గమీద కాదండోయ్.. ఏకంగా పెదాలపై.. అదీ చట్టసభలో. ఇది వారి సంస్కృతిలో భాగం కావచ్చేమో కానీ, అందరూ చూస్తుండగా ఇలా పబ్లిక్ గా చుంబించుకోవడం అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
మంగళవారం కాపిటల్ హిల్‌లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియర్ ప్రసంగం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. తనవైపుగా వస్తున్న జిల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు మొదట డగ్ చేయి చాచారు. కానీ, జిల్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన పెదాలను ముద్దాడారు. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్నవారంతా వారిని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టడం గమనార్హం. ఎనిమిది సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను బెన్నీ జాన్సన్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్లు, ఎమోజీల వరద పారిస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి సీన్లు సినిమాల్లో చూశాం.. కానీ, చట్టసభలో చూడటం ఇదే మొదటిసారి అంటూ తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Did Jill Biden just kiss Kamala’s husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu
— Benny Johnson (@bennyjohnson) February 8, 2023