బిల్కిన్ బానో కేసు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. 2002లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన, కుటుంబం హత్య కేసులో 11 మందిని విడుదల చేయడం పెద్దఎత్తున విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలో చోటుచేసుకోనుంది. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, వ్యతిరేకతకు తెర లేపింది. వివరాల్లోకి వెళ్తే..
ఆగస్టు 17న ఇండోనేషియాకు స్వాంతంత్రం లభించింది. ఈ సందర్భంగా పలువురు ఖైదీలను విడుదల చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఉమర్ పటేక్ అనే పేరుమోసిన ఓ ఉగ్రవాదిని విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న జెమాహ్ ఇస్లామియా సంస్థకు చెందిన వాడు. అతడిని విడుదల చేయడంపై ఆస్ట్రేలియా ఖడించడమే కాకుండా.. తీవ్ర నిరసన తెలుపుతోంది.
Bali bomb maker Umar Patek cannot be allowed to walk free after only 10 years. He is responsible for the deaths of 202 people. Prime Minister Anthony Albanese and Foreign Minister Penny Wong cannot allow this to happen.
My full thoughts at @AusTodayListnr pic.twitter.com/5Jf6hFE5rs
— Steve Price (@StevePriceMedia) August 19, 2022
2000 సంవత్సరంలో ఇండోనేషియాలోని జకర్తాలో క్రిస్మస్ సందర్భంగా పలు చర్చీలపై ఉగ్రవాద దాడి జరిగింది. ఆ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడిలో ఉమర్ పటేక్ కూడా పాల్గొన్నాడు. 2002 సంవత్సరంలో బాలిలో బాంబు దాడి జరిగింది. అందులో 88 మంది ఆస్ట్రేలియా పౌరులు సహా మొత్తం 202 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉగ్రదాడి వెనుక కూడా ఉమర్ పటేక్ ఉన్నాడు.
Australian PM Anthony Albanese says Indonesia’s decision to further reduce the prison sentence of Umar Patek for his role in the 2002 Bali bombing is upsetting https://t.co/0A5nB6pwe0 pic.twitter.com/eeUluJv0BB
— Al Jazeera English (@AJEnglish) August 19, 2022
2012లో ఇండోనేషియా కోర్టు ఉమర్ పటేక్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిచింది. అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండోనేషియా ప్రభుత్వం ఉమర్ పటేక్ విడుదల చేస్తున్నట్లు.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తెలిపారు. ఉమర్ పటేక్ విడుదలకు సంబంధించి తమ ప్రశ్నలకు ఇండోనేషియా నుంచి సమాధానం లేదని వెల్లడించారు. తమ అభిప్రాయాలను మాత్రం ఇండోనేషియాకు తెలియజేశామన్నారు. ఉమర్ పటేక్ విడుదల అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Anthony Albanese has revealed he was unaware of the early release of Bali bomber Umar Patek and acknowledged the distress to grieving families > https://t.co/SAv6UolW1o pic.twitter.com/QIAtgP2Qpb
— Herald Sun (@theheraldsun) August 19, 2022