ఆదివారం నేపాల్ దేశంలో చోటుచేసుకున్న విమాన దుర్ఘటన గురించి అందరికి తెలిసింది. సంక్రాంతి పండగ వేళ ఆదేశంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లో అందులోని ప్రయాణికులు.. తమ గమ్యానికి చేరుకుంటాము అనుకునే సమయంలో సాంకేతి లోపంతో విమానం కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే అందులోని 72 మంది సజీవ దహనం అయ్యారు. అయితే ఈ భీకర ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో బయటకి వచ్చింది. ఈ విమానం కూలిపోయే సమయంలో అందులోని ఓ ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ లో ఉన్నాడు. దీంతో ప్రమాదం జరిగే కొన్ని క్షణాల ముందు విమానంలో జరిగిన దృశ్యాలు బయటకి వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదివారం నేపాల్ లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నారు. వీరిలో ఒకరైన సోను జైస్వాల్ అనే ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోలో జైస్వాల్.. విమానంలో కిటికీ పక్కన కూర్చుని తన ఫోన్ ద్వారా ఫేస్ బుక్ లైవ్ స్టీమింగ్ చేస్తున్నాడు. గాల్లో నుంచి కింద కనిపించే సిటీ అందాలను చూపించారు. అంతేకాక విమానం లోపల ఉన్న ప్రయాణికులను చూపించారు. ఆ వీడియో చూసినట్ల అయితే అందరు ఎంతో ప్రశాంతగా ఉన్నారు. కొద్ది సమయంలో తాము గమ్యస్థానానికి చేరుకోనున్నామనే ఆలోచనలో ఉన్నారు.
సరిగ్గా అదే సమయంలో విమానం కుదుపునకు గురైంది. గాల్లో ఉండగానే విమానం లోపల మంటలు చెలరేగినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో అందులోని ప్రయాణికులు పెద్ద ఎత్తున హాహాకారాలు చేయడం కొన్ని క్షణాల పాటు కనిపించింది. ఆ తరువాత కొన్ని సెకన్లకు భారీ శబ్దంతో విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన ఈ దృశ్యాలని ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ లో రికార్డయ్యాయి. అప్పటి దాకా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిరునవ్వులు చిందించిన ప్రయాణికులు.. మంటల్లో సజీవ దహనం అయ్యారు. సోను జైస్వాల్ ఫేస్ బుక్ ఖాతాలో కన్పించిన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యేతి ఎయిర్ లెైన్స్ కు చెందిన ఏటీఆర్-72 విమానం ఖాట్మాండు లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి పొఖారాకు ఆదివారం ఉదయం 10.33 గంటల సమయంలో బయలుదేరింది. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బయలుదేరిని విమానం మరో 5 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకోనుంది. సరిగ్గా పొఖారా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. స్థానికులు చూస్తుండగానే ఇళ్లపై నుంచి వెళ్తూ.. పొఖారా విమానాశ్రయ సమీపంలోని కొండ ఢీకొట్టి కుప్పకులిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రాణమూ కూడా మిగల్లేదు. అందులోని 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా.. మొత్తం 72 మంది దుర్మరణం చెందారు. సేతి గండకి అనే నది పరీవాహక ప్రాంతంలోని అటవీ ప్రదేశంలో ఈ విమానం ప్రమాదం జరిగింది.
ఈ నది పాత డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు, పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యలో ప్రవహిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో 53 మంది నేపాలీలు, ఐదురుగురు భారతీయులు, నలుగురు రష్యన్ లు, ఇద్దరు కొరియన్ లు, ఇద్దరు ఐర్లాండ్ కు చెందినవారు. అంతేకాక ఆఫ్ఘనిస్థాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
नेपाल विमान हादसे का आखिरी वीडियो है जो मेरे घर के बगल के अभिषेक भैया रिकॉर्ड किए थे 😭 #YetiAirlines #NepalPlaneCrash@ABPNews @aajtak pic.twitter.com/Zcix3OdJ62
— Satish Maurya (@smaurya4191) January 15, 2023