పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడగా, కాలులోకి మూడు నుంచి నాలుగు బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. వజీరాబాద్ లాంగ్ మార్చ్ సమయంలో ఈ దాడి జరిగింది. దుండగుడు అతి దగ్గర నుంచి ఏకే-47 గన్‌తో కాల్పులు జరపగా, ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. వెంటనే కాల్పులు జరిపిన వ్యక్తిని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతడిని విచారించగా అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు.
వజీరాబాద్ లాంగ్ మార్చ్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు కంటెయినర్ పైకి ఎక్కిన సందర్భంలో నిందితుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కుడి కాలికి గాయం కాగా, ఆయన కార్యదర్శి రషీద్, సింధు మాజీ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్, పీటీఐ నేత ఫైసల్ జావేద్ సహా మరికొందరు నేతలకు గాయాలయ్యాయి. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులకు తెగబడ్డ నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందునే ఇమ్రాన్ ఖాన్ని చంపేందుకే తాను ఇక్కడికి వచ్చానని నిందితుడు వెల్లడించాడు. ఈ లాంగ్ మార్చ్ నేపథ్యంలో ఆయన ప్రజల్ని తప్పుదోవపట్టిస్తుంటే చూస్తూ భరించలేకపోతున్నానని.. అందుకే ఆయన్ను చంపేందుకు ప్రయత్నించినట్టు తెలిపాడు.
Imran Khan was shot in the leg but was stable while being taken to hospital. He waived at supporters too. #عمران_خان_ہماری_ریڈ_لائن_ہے pic.twitter.com/XizoAQzPax
— PTI (@PTIofficial) November 3, 2022
Discrepancies in the confession video.
1- In the beginning of video, he says he decided on the spot to kill Imran Khan.
2- Then he says he was tracking Imran Khan since the day Khan left Lahore to kill him. pic.twitter.com/fpIjwWkH7B
— OSINT Insider (@OSINT_Insider) November 3, 2022