భారతదేశం నుంచి ఎంతో విలువైన సంపదను బ్రిటీష్ వాళ్లు దొంగిలించారు. అలాంటి విలువైన సంపదలో వజ్రాలు, బంగారం ప్రధానమైనవి. మన దేశానికి చెందిన ఎన్నో విలువైన వజ్రాలు ఇతర దేశాల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన కోహినూర్ డైమండ్ ను ఇంగ్లాండ్ వాళ్లు దోచుకెళ్లారు. అమెరికాలో కోహినూర్ అంత విలువైన మరో వజ్రం ఉంది. దాని విలువ అక్షరాల రూ.2,700 కోట్ల రూపాయాలు. దాని పేరు హోప్ వజ్రం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ డైమండ్ కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అమెరికా వాషింగ్టన్ డి.సి. లోని వాషింగ్టన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ లో ఈ హోప్ అనే విలువైన వజ్రం ఉంది. 45.52 క్యారెట్స్ విలువ చేసే ఈ వజ్రం బ్లూ కలర్ లో ఉంది. దీని చుట్టూ 16 తెల్ల రంగు వజ్రాలు ఉన్నాయి. మరో వరుసలో 46 చిన్న వజ్రాల చైన్ ఉంది. దీని విలువ రూ.2,700 కోట్లు. అసలు విషయం ఏమిటంటే కోహినూర్ డైమండ్ లాగానే హోప్ డైమండ్ కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందినదే. ఏపీ, గుంటూరు జిల్లాలోని కొల్లూరు ప్రాంతంలో ఈ వజ్రం లభించింది. హోప్ వజ్రం చరిత్రలోకి వెళ్తే..
హోప్ డైమండ్ కొల్లూరు గనుల్లో లభ్యమయిందని చరిత్ర చెబుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం కూడా ఈ గనుల్లోనే దొరికిందని అంచనా. ట్రావెర్నర్ ఈ వజ్రానికి సానబెట్టే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లోని నీలి రంగు వెలుగు చూసిందని చరిత్ర చెబుతోంది. 1668 సంవత్సరంలో ట్రావెర్నర్ ఈ నీలి వజ్రాన్ని కింగ్ లూయిస్ కు అమ్మేశాడు. కొంత కాలం తరువాత ఇది గల్లంతైంది. 1791లో దీన్ని మళ్లీ ముక్కలు చేశారు. అతిపెద్ద ముక్కకు “హోప్”అని పేరు పెట్టారు. 1839లో హోప్ పేరున్న బ్రిటీష్ బ్యాంకింగ్ కుటుంబం తమ వద్ద ఉన్న విలువైన వజ్రాల జాబితాలోకి దీన్ని చేర్చింది. హోప్ కుటుంబం నుంచి ఇది చాలాసార్లు చేతులు మారింది. 1958 సంవత్సరంలో హ్యారీ విన్ స్టన్ అనే అమెరికన్ వ్యాపారి దీన్ని వాషింగ్టన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి దానమిచ్చారు. ప్రస్తుతం ఈ హోప్ డైమండ్ కి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.