నాన్నల్ని, వారి త్యాగాలను గుర్చించడానికి ఓ రోజు ఉంది. అదే ఫాదర్స్ డే. అంటే పితృ దినోత్సవం. ప్రతీ ఏటా మాతృ దినోత్సవం జరుపుకొన్నట్టే తండ్రుల కోసం ప్రత్యేకంగా ఓ రోజును సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు. ఫాదర్స్ డేను మొదటిసారిగా అమెరికాలో సెలబ్రేట్ చేశారు.
కుటుంబం కోసం అనుక్షణం ఎంతో కష్టపడినా ఎప్పుడూ తెర వెనకాలే ఉండే వ్యక్తి నాన్న. ఆయన ప్రేమ ఎవరికీ అర్థం కాదు. ఎంత సేపూ అందరూ అమ్మ గురించే చెప్తారు.. మరి నాన్న గురించి చెప్పేదెవరు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల తేదీలలో ఫాదర్స్ డేని జరుపుకున్నా, మన దేశంలో మాత్రం ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన జరుపుకుంటున్నాము. నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.