ఇటీవల పలు చోట్లు అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్, సిలిండర్లు పేలిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల వల్ల తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.
ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకు వస్తాయో ఎవరూ చెప్పలేరు. ఇటీవల పలు చోట్ల గ్యాస్ లీకేజ్, సిలిండర్లు పేలిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. తాజాగా ఇటలీలోని మిలాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారే భయంతో వణికిపోయారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ఇటలీలోని మిలన్ మధ్యలో గురువారం పేలుడు సంభవించి అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయని, ఒక వ్యక్తి గాయపడ్డాడని అగ్నిమాపక దళం తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణం ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు రవాణా చేస్తున్న వ్యాన్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి ఉండవొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేలుడు తో అక్కడ దట్టమైన పోగ అలుముకుంది. సంఘటన స్థలంలో ఓ పాఠశాల, నర్సింగ్ హూం ఉండటంతో వెంటనే అందులో ఉన్నవారిని ఖాళీ చేయించారు పోలీసులు. ప్రస్తుతం అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Scene of explosion in Milan, Italypic.twitter.com/94aJPjaymD
— The Spectator Index (@spectatorindex) May 11, 2023