మాతృత్వం అందమైన వరం. ప్రతి ఒక్క మహిళ ఈ అనుభూతిని ఆస్వాదించాలని అనుకుంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలని మనస్సు పరితపిస్తూ ఉంటుంది. తల్లి స్థానంలో పిల్లల ముద్దు ముచ్చట్లు, కేరింతలు, ఆలనా పాలనా చూడాలని ఆశిస్తూ ఉంటుంది.
మాతృత్వం అందమైన వరం. ప్రతి ఒక్క మహిళ ఈ అనుభూతిని ఆస్వాదించాలని అనుకుంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలని మనస్సు పరితపిస్తూ ఉంటుంది. తల్లి స్థానంలో పిల్లల ముద్దు ముచ్చట్లు, కేరింతలు, ఆలనా పాలనా చూడాలని ఆశిస్తూ ఉంటుంది. అయితే కొంత మందికి అనారోగ్య సమస్యల కారణంగా పిల్లలు కలగరు. వైద్యులను ఆశ్రయించి, చికిత్స ద్వారా నయం అయితే పర్వాలేదు కానీ.. ఇక పిల్లలు కలగరని తెలిస్తే ఆ మాతృమూర్తి హృదయం తల్లడిల్లిపోతుంది. అయితే తల్లి అనిపించుకునేందుకు మరో మార్గం కూడా లేకపోలేదు. అదే దత్తత. ఇప్పుడు చాలా మంది పిల్లలు లేని భార్యా భర్తలు అవగాహన పెరిగి దత్తతపై మక్కువ చూపుతున్నారు.
తాజాగా ఇటలీ నుండి వచ్చిన ఓ జంట బాలుడ్ని దత్తత తీసుకుని సహృదయాన్ని చాటారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న మాతా శిశు సంక్షేమ గృహంలో ఉన్న ఓ అనాధ బాలుడ్ని ఇటలీ నుండి వచ్చిన దంపతులు అడాప్ట్ చేసుకున్నారు. 10 ఏళ్ల వయసు ఉన్న అనాథ బాలుడ్ని వారికి స్పెషలైజ్డ్ అడాప్షన్ ప్రోగ్రాం ద్వారా వారికి అప్పగించారు. అన్ని లాంఛనాలు పూర్తయ్యాక బాలుడ్ని ఆ దంపతులకు ఇచ్చారు. తాము తమ కన్నబిడ్డలా గోపినీ చూసుకుంటామని, ప్రతి మూడు నెలలకొకసారి అతని బాగోగులకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపికి తెలిపారు. వారితో వెళ్లేందుకు పూర్తిగా సమ్మతమేనా అని బాలుడ్ని కలెక్టర్ ప్రశ్నించగా..అందుకు అతడు ఓకే చెప్పాడు. బాలునితో మాట్లాడుతూ అతని యోగ క్షేమాలపై ఆరా తీయాలని మహిళాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ గోపి ఆదేశించారు.