ఎలన్ మస్క్ తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచనలంగా మారుతోంది. ఎప్పుడు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే తాజాగా ఆయన ట్విట్టర్ లో చేసిన ఓ పోస్ట్ చూస్తుంటే అతనిని చావు భయం వెంటాడుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. తాను ఒకవేళ అనుమానాస్పద స్థితిలో మరణించవచ్చు.. కానీ నేను మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశాడు.
ఇది కూడా చదవండి: Iraq: షాకింగ్ వీడియో: కొడుకు నోట్లో సిగరెట్.. గన్‌తో కాల్చిన తండ్రి..!
ఇదిలా ఉంటే ప్రపంచ దేశాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రముఖులను రష్యా లక్ష్మంగా చేసుకుని వారిని హత్య చేస్తుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ తాజాగా ఈ విధంగా ట్వీట్ చేయడమనేది కాస్త అనుమానంగా మారుతోంది. అయితే ఎలన్ మస్క్ ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ రష్మా అధికారి నుంచి బెదిరింపు పోస్ట్ కూడా వచ్చిన్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ లోని కమ్యూనికేషన్ సామాగ్రిని పంపించి, నాజీ దళాలకు సహకారంతో మీ భాగస్వామ్యం ఉంది ఈ పరిణామాలకు మీరు భారీ ముల్యం చెల్లించుకుంటారనే బెదిరింపు పోస్ట్ వచ్చిందట. ఇక వీటన్నటినీ బేరీజు వేసుకునే మస్క్ ఈ విధమైన ట్విట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎలన్ మస్క్ చేసిన ఈ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
— Elon Musk (@elonmusk) May 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.