అమెరికన్ పాప్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మోస్ట్ పాపులర్ ‘ఫూ ఫైటర్స్’ డ్రమ్మర్ టేలర్ హాకిన్స్.. శుక్రవారం కొలంబియన్ హోటల్ లో కన్నుముశారు. ఈ విషయాన్ని ‘ఫూ ఫైటర్స్’ బ్యాండ్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. గ్రామీ అవార్డులు అందుకున్న బ్యాండ్ లో డ్రమ్మర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టేలర్. 50 సంవత్సరాల వయసులోనే టేలర్ మరణించడంతో అతని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
టేలర్ చనిపోయిన విషయాన్ని ప్రకటిస్తూ ‘ఫూ ఫైటర్స్’ బ్యాండ్ ట్విట్టర్ లో.. “టేలర్ సంగీత స్ఫూర్తి, అతని చిరునవ్వు మనందరితో ఎప్పటికీ ఉంటాయి” అని పేర్కొంది. ఇక టేలర్ మరణానికి ప్రముఖ సంగీత దర్శకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. కొలంబియాలోని ఫోర్ సీజన్స్ కాసా మదీనా హోటల్ లో శుక్రవారం రాత్రి టేలర్ హాకిన్స్ చనిపోయినట్లు సమాచారం. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే అతని అభిమానులు హోటల్ వద్దకు చేరుకున్నారు. మరి హాకిన్స్ ఎలా చనిపోయాడు అనేది ఇంకా కొలంబియన్ అధికారులు వెల్లడించలేదని తెలుస్తోంది.
— Foo Fighters (@foofighters) March 26, 2022
ఇక టేలర్ మరణవార్త విన్న ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లాని ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని తెలిపారు. ‘నిజంగా ఇది విచారకరమైన వార్త’ అంటూ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టేలర్ ఫ్యాన్స్ మౌనం పాటిస్తూ.. వీధుల్లో కాండిల్స్ వెలిగిస్తూ సంతాపం తెలుపుతున్నారు.
Truly sad. 🙁
Condolences to his family and his band.#TaylorHawkins #FooFighters pic.twitter.com/WQpMqjuiCE
— VISHAL DADLANI (@VishalDadlani) March 26, 2022