అయినా లాభం లేకుండా పోతూ ఉంటుంది. కానీ, ఓ డాక్టర్ కేవలం డైట్ మెయింటెనెన్స్ తో, ఫిజికల్ ఎక్సెర్‌సైజ్ ద్వారా ఏకంగా 110 కిలోల బరువు తగ్గానని చెబుతున్నారు.
ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవటం మంచిదని వైద్యులు చెబుతూ ఉంటారు. దీనితో పాటుగా మార్నింగ్ వాకింగ్ కి వెళ్లటం ఉత్తమం అని సూచిస్తుంటారు. కొందరు ఫిట్ నెస్ కోసం జిమ్ కి వెళుతుంటారు. మరి కొందరు వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివి చేస్తుంటారు. ఇదంతా చాలా కొద్ది మందికి సబంధించిన విషయం. చాలా మంది నేడు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుని అనారోగ్యం పాలవుతున్నారు. విపరీతంగా బరువు పెరిగిపోయి నానా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గించుకునేందుకు చాలా మంది వెయిట్ లాస్ సెంటర్స్‌కు వెళుతుంటారు.
అయినా లాభం లేకుండా పోతూ ఉంటుంది. కానీ, ఓ డాక్టర్ కేవలం డైట్ మెయింటెనెన్స్ తో, ఫిజికల్ ఎక్సెర్‌సైజ్ ద్వారా ఏకంగా 110 కిలోల బరువు తగ్గానని చెబుతున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. చెన్నైకి చెందిన డాక్టర్ అనిరుద్ద్ దీపక్ ఒకప్పుడు 194 కిలోల బరువు ఉండేవాడు. చిన్నప్పటినుండి అతిగా తినడం అలవాటు. ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండేవాడు. అతిగా తినడం వల్ల తను చాలా బరువు పెరిగిపోయాడు. 2018లో అతను ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అదే సంవత్సరం తను చాలా సిక్ అయ్యాడు. ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందించారు. శారీరకంగా బరువు తగ్గించుకోవాలని లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు అనిరుద్ద్ కు చెప్పారు. అప్పుడు ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడువుగా ఓ ట్రైనర్‌ను కలిశాడు. అతడు చెప్పింది చేశాడు. ఫుడ్ డైట్.. ఫిజికల్ ఎక్సర్‌సైజులు చేసి.. రెండేళ్లలో ఏకంగా 110 కిలోల బరువు తగ్గాడు. ఆ డైట్ ఏంటంటే.. అతడు ప్రతి రోజు 5మి.లీ. వంట నూనెను మాత్రమే వాడేవాడు. రోజులో 2000 కేలరీలు ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పోహా లేదా చపాతీ , సోయా చంక్స్, సలాడ్ తీసుకునేవాడు. మధ్యాహ్న భోజనంలో రైస్ లేదా రోటీ, పప్పు లేదా రాజ్మా, కూర, పెరుగు తీసుకునేవాడు. రాత్రి భోజనంలో రైస్ లేదా రోటీ, పన్నీర్, కూర, పెరుగు తీసుకునేవాడు. స్నాక్స్ టైంలో పండ్లు, బాదాం తినేవాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాడు. దీంతో రెండేళ్లలో 110 కిలోలు తగ్గాడు. మరి, పట్టు వదలని విక్రమార్కుడిలా రెండేళ్లలో 110 కిలోలు తగ్గిన ఈ డాక్టర్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.