ప్రతీ మనషి జీవితంలో గుర్తుండిపోయే శుభకార్యం ఏదైనా ఉంది అంటే అది పెళ్లి అని చెప్పొచ్చు. అలాంటి పెళ్లికి సంబంధించిన విషయాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్.. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవ్వరమూ ఊహించలేము. ప్రతీ నిమిషం ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూ ఉంటుంది. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకు ఎప్పుడూ గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారిపోతాయి. కొత్తగా పెళ్లయిన ఓ జంట జీవితంలోనూ ఓ గుర్తుండిపోయే సంఘటన జరిగింది. తమ పెళ్లి రిసెప్షన్లో పాల్గొనటానికి వెళుతున్న వారికి అనుకోని ఘటన ఎదురైంది. వారు ఎక్కిన లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వారు తమ సొంత పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లలేకపోయారు. రిసెప్షన్ అయిపోయిన తర్వాత అతికష్టం మీద లిఫ్ట్‌నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని నార్త్ కరోలినా, చార్లటీకి చెందిన భారత సంతతి జంట పనవ్, విక్టోరియా ఝాకు కొద్దిరోజుల క్రితం పెళ్లి అయింది. పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ గ్రాండ్ బెహెమియాన్ హోటల్లోని 16వ అంతస్తులో జరుగుతోంది. ఇందుకోసం పనవ్, విక్టోరియా రెడీ అయి రాత్రి హోటల్‌కు వచ్చారు. 16వ అంతస్తుకు వెళ్లటానికి లిఫ్ట్ ఎక్కారు. అయితే, వారు ఎక్కిన లిఫ్ట్ కొంత పైకి వెళ్లి ఆగిపోయింది. లోపలినుంచి బయటకు వెళ్లటానికి కానీ, సమాచారం అందించటానికి కానీ, ఎలాంటి సౌకర్యం లేకపోయింది. హోటల్ సిబ్బందినుంచి ఫైర్ ఫైటర్స్‌కు సమాచారం వెళ్లలేదు.
రాత్రి మొత్తం వారు ఆ లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. వారి పెళ్లి రిసెప్షన్‌కు కూడా వెళ్లలేకపోయారు. లిఫ్ట్ ఆగిపోయినట్లు సిగ్నల్స్ వెళ్లటంతో మరుసటి రోజు ఉదయం ఫైర్ ఫైటర్స్ హోటల్‌కు వెళ్లారు. అతి కష్టం మీద వారిని బయటకు తీసుకువచ్చారు. వీరికోసం పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన వారు కూడా ఎంతో శ్రమించారు. ఎలాగైతేనేం వారు బయటపడ్డారు. ప్రస్తుతం ఈ కొత్త జంట లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఫొటోలు, ఫైర్ ఫైటర్స్ ఇద్దర్నీ బయటకు తీసుకువస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, లిఫ్ట్‌లో ఇరుక్కుపోవటం కారణంగా తమ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లలేకపోయిన ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.