మనిషి జీవితంలో కష్టసుఖాలు అనేవి రేయింబవళ్ల మాదిరిగా వచ్చిపోతుంటాయి. అందుకే జీవితాన్ని సుఖదుఃఖాల సంగమం అని పెద్దలు అంటారు. అయితే కొందరిని మాత్రం ఎప్పుడు కష్టాలే పలకరిస్తుంటాయి. అయితే చాలా మంది అదృష్టమనేది ఉంటే తలరాత మారుతుందనే విషయాన్ని బలంగా నమ్ముతుంటారు. అలా వారి అభిప్రాయాలకు బలం చేకూర్చేలే అనేక ఘటనలు జరుగుతున్నాయి. కటిక పేదరికం అనుభవించే వ్యక్తి.. రాత్రికి రాత్రే కోటేశ్వరు అయిపోవడం, అలానే తిన్నడానికి తిండిలేని వారు కూడా ఒకరోజులో ధనవంతులుగా మారిపోవడం వంటి ఘటనలు అనేకం చూశాం. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా మంది.. “వాడికి అదృష్టలక్ష్మి పట్టిందిరా” అని అనుకుంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ సామాన్యుడికి రూ.6250 కోట్ల లాటరీ తగిలింది. తన జీవితంలో ఊహించనంత డబ్బులను గెలుచుకోవడంతో సదరు వ్యక్తి ఆనందంతో ఉబ్బితబ్బి అవుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో నివాసం ఉండే ఓ సామాన్యుడికి భారీ జాక్ పాట్ తగిలింది. పవర్ బాల్ లాటరీ గేమ్ లో ఆ వ్యక్తి 754.6 మిలియన్ డాలర్ల భారీ సొమ్మును లాటరీలో గెలుచుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.6,250 కోట్లకు పైగా ఈ లాటరీ సొమ్ము ఉంటుంది. పవర్ బాల్ లాటరీ గేమ్ లో అతడు ఈ భారీ జాక్ పాట్ సొంతం చేసుకున్నారు. అతడికి తగిలిన ఒకటి టికెట్ విలువ.. 05,07,11,22,23,69, అనే ఆరు నంబర్లతో సరిపోలిందని లాటరీ నిర్వాహకులు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ భారీ జాక్ పాట్ లాటరీ తగిన వ్యక్తిని గుర్తించాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. లాటరీలో గెలుచుకున్న ఈ భారీ మొత్తాన్ని విజేతకు విడతల వారీగా చెల్లిస్తారంట. తొలుత కొంతమొత్తాన్ని ఇచ్చేస్తారంట. మిగిలిన మొత్తాన్ని గెలిచిన రోజు నుంచి 29 సంవత్సరాల వరకు వాయిదాల ప్రకారం చెల్లిస్తారు.
అంతేకాక గెలుచుకున్న సొమ్ముకు ఏడాదికి 5శాతం చొప్పున వడ్డీని జత చేసి.. అదనంగా చెల్లిస్తారు. అదికూడా విజేత అంగీకరిస్తేనే జరుగుతుంది. అలా కానీ పక్షంలో గెలుచుకున్న 754.6 మిలియన్ డాలర్ల లాటరీలో నుంచి కేవలం 407.2 మిలియన్ డాలర్ల మాత్రమే ఇస్తారు. ఆ సొమ్మును మొత్తాన్ని విజేత చేతికి ఒకేసారి అందజేస్తారు. అమెరికా లాటరీ చరిత్రలోనే ఇది తొమ్మిదో అతిపెద్ద లాటరీ అని నిర్వాహకులు చెబుతున్నారు. మరి.. ఆ అదృష్టవంతుడు ఎవరా? అని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. అయితే లాటరీ గెలుచుకున్న వ్యక్తి కూడా ఈ విషయం తెలిసినట్లు సమాచారం. మరి.. ఇలా అజ్ఞాత అదృష్టవంతుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.