కరోనా వైరస్ అనే బయో వెపెన్ ప్రయోగించి ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలో పడేలా చేసి.. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా వెలుగుతోన్న చైనాకు అతి పెద్ద కష్టమొచ్చింది. చైనా అనుకున్నట్లుగానే కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో ఎంత విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రరాజ్యమైన అమెరికా సైతం సంక్షోభంలో కూరుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెట్టిన చైనా ఆర్థిక సంక్షోభం దిశగా పరుగులు తీస్తోంది. ఇన్నాళ్లు చైనా ఆర్థిక వ్యవస్తకు వెన్నుముఖగా నిలిచిన రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీసే స్థాయికి చేరింది.
చైనా అభివృద్ధిలో అత్యంత కీలకమైంది.. రియల్ ఎస్టేట్ మార్కెట్. ముఖ్యంగా షీజిన్ పింగ్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ మార్కెట్ అభివృద్ధిలో ఆకాశాన్ని దాటింది. ఎవ్వరు ఊహించనంతగా గత 15 ఏళ్లలో 600 శాతం పెరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే.. ఎంత ఎత్తు ఎగిరినా కింద పడక తప్పదు అన్నట్లుగా ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. నాన్జింగ్ లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల చొప్పున లెక్క గట్టి గృహ కొనుగోలు చెల్లింపులుగా అంగీకరిస్తోంది అంటూ చైనా ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
Restricted from cutting prices, parts of China developers are accepting food product as partial payment. Reportedly a developer offered $14,921 discount off in exchange for 5,000kg of watermelons – at least five times the market rate @NewIndianXpress
— Yeshi Seli ਯੇਸ਼ੀ ਸੇਲੀ (@YeshiSeli) July 5, 2022
ఇది కూడా చదవండి: Love: 11 ఏళ్లకే ప్రేమ.. లవర్ తండ్రిని ప్రేమించిన అమ్మాయి!..
గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రకారం.. చైనాలో ఇళ్లు కొనుక్కున్న వారు బిల్డర్లకు డబ్బులు ఇవ్వటంలేదట. డబ్బులకు బదులుగా పుచ్చకాయలు, గోధుమలు, వెల్లిల్లి ఇస్తున్నారన్నది సారాంశం. ఇందుకు కారణం చైనాలో పెరిగిన ఆర్థిక సంక్షోభమే కారణం. బిల్డర్లు ఇళ్లు కొనేవారు లేక అల్లాడిపోతున్నారు. పుచ్చకాయలు లేదా ఏదైనా ఇచ్చి ఇల్లు కొనుక్కోండి అంటూ బోర్డులు పెడుతున్నారట. రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీసే స్థాయికి చేరడంతో బిల్లర్డు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారన్నది అసలు విషయం. బిల్డర్లకు మరోదారి లేక ఇళ్లను నగదుకు బదులు గోధమలు, వెల్లుల్లి, పుచ్చకాయల రూపంలో చెల్లింపులు చేయాలని ఆఫర్లు ఇస్తున్నారట. అయినా ఇళ్ల కొనుగోలుకు అక్కడి ప్రజలు ముందుకు రావడం లేదట.
One developer in the eastern city of Nanjing said it would accept truckloads of watermelons worth up to 100,000 yuan as down payment from local farmers, state-run China News Weekly reported. https://t.co/K8U1FjYBID pic.twitter.com/i0dgcWIjop
— The Philippine Star (@PhilippineStar) July 4, 2022
అంతేకాదు.. చైనా ప్రయోగించిన కరోనా వైరస్ కారణంగా పలు దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆ సమయంలో పెద్దన్నగా నేనున్నానంటూ చైనా పలు దేశాలకు అప్పులిచ్చింది. అయితే.. సంక్షోభంలో కూరుకుపోయిన పేద దేశాలు ఆ అప్పులను మళ్లీ తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ క్రమంలో చైనా ప్రస్తుతం 36 బిలియన్ డాలర్లు చైనా నష్టంలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడేయడానికి షీజిన్ పింగ్ కూడా సుముఖత చూపట్లేదన్నది అసలు నిజం. ఈ సంక్షోభం నుంచి చైనా ఎలా బయటపడుతుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Teenage Girl: కుబేరుడి సోదరి.. ఒక్క రోజే 40 లక్షలు ఖర్చు చేస్తుంది!